Pregnancy : గర్బం నిలబడటం లేదా? కారణాలు ఇవే కావొచ్చు..

Pregnancy : అమ్మతనం పొందడం ఒక వరం లాంటిది. పిల్లలతోనే వైవాహిక జీవితం సంపూర్ణమవుతుంది. అందుకే ప్రతి మహిళా అమ్మతన్నాన్ని ఒక వరంలా భావిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు గర్భస్రావానికి గురవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? 
 

why does pregnancy go away reasons

Pregnancy : పిల్లలోతోనే వైవాహిక జీవితం సంపూర్ణం అవుతుంది. అందులోనూ ప్రతి మహిళకూ అమ్మతనం ఓ వరం లాంటిది. గర్భం దాల్చినమని తెలియగానే మహిళల ఆనందానికి అవదులు ఉండవేమో. ఒకలాంటి ఆనందం సాగరంలో విహరిస్తుంటారు. అయితే కొంతమంది మహిళలు మాత్రం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిక కొంతమందికి అనుకోని కారణాల వల్ల Miss Carriage అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేశన్ ముఖ్యంగా గర్భం దాల్చిన వారంలోపలే జరుగుతుంది. లేదంటే తర్వాతైనా జరుగుతూ ఉంటాయి. కారణాలేవైనా.. గర్భస్రావం వల్ల మహిళలు ఎంతగానో మనో వేధననకు గురవుతుంటారు.

గర్భంస్రావం అవడానికి ప్రధాన కారణం.. పిండం ఏర్పడటంలో వచ్చే సమస్య. అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులో వివాహం చేయడం వల్ల కూడా ఇలా గర్బం పోతుంటుంది. గర్భస్రావం ఎక్కువగా 3 నుంచి 5 నెలల లోపే జరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే గర్బం దాల్చిన వారం లోపే పోవడానికి కారణం వారి శరీరంలో  Chromosomes లోపం వల్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్నే Genetic రీజన్ అని కూడా అంటారు. 

వన్స్ ఇలా జరిగిందని మళ్లీ మళ్లీ గర్భస్రావం అవుతుందన్న నమ్మకం లేదు. అయితే 35 ఏండ్లు దాటిన మహిళల్లో గర్భస్రావం ఎక్కువగా అయ్యే  ప్రమాదముందట. ఎందుకంటే వీరిలో జన్యుపరమైన సమస్యలు తలెత్తడంతో ఇలా జరిగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక బరువున్నా, స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నా, గర్బాశయ ముఖద్వారం (Cervix) బలంగా లేకపోయినా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే Cervical structure లో ఏవైనా లోపాలున్నా, డయాబెటీస్ అదుపు తప్పినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాగర్భం నిలబడదు. 

గర్భస్రావం అయ్యే ముందు కనిపించే లక్షణాలు:  గర్భస్రావం అయ్యే టప్పుడు పొత్తికడుపులో విపరీతమైన నొప్పి పుడుతుంది. అలాగే యోగి నుంచి బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది. అంతేకాదు రక్తం గడ్డలు గడ్డలుగా, ముక్కలు, కణజాలం వంటివి యోని నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. ఇవి సాధారణ లక్షణాలు. అయితే కొంతమందిలో ఇలాంటివేవీ కనిపించవు. కారణం బిడ్డ ఎదుగుదల ఆగిపోవడం.. దీనితో పిండం మరణించే అవకాశం ఉంది. అలాంటి వారు ఎలా గుర్తించాలంటే.. ప్రెగ్నెన్సీ టైం లో వచ్చే వేవిళ్లు పూర్తిగా తగ్గిపోతారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోవాలి.

అయితే గర్బ స్రావం సమయంలో కొంతమంది విపరీతమైన కడుపునొప్పి వస్తుంటుంది. దీనికి తోడు నల్లని లేదా ఎరుపు రంగు రక్తం గడ్డలు బయటకు వస్తుంటాయి. అదే సమయంలో వారికి ఒకవైపు మాత్రం కడుపునొప్పి వస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యలను సంప్రదించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios