మహిళలు నాలుగు పదుల వయసుకి దగ్గరపడుతున్నారంటే చాలు వారిలో అప్పటి వరకు ఉన్న ఉత్సాహం క్రమంగా తగ్గడం మొదలుపెడుతుంది. వారిలో ఉన్న లైంగికాసక్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకిలా అంటే.. వారు మనోపాజ్ దశకు దగ్గరపడుతున్నారని అర్థమంటున్నారు నిపుణులు.

ఈ మోనోపాజ్ దశ మొదలైంది అంటే.. వారు ఇక సంతానోత్పత్తికి దూరమైనట్టే. వారిలో రుతుక్రమం ఆగిపోతుంది. హార్మోన్ల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. గర్భం లేకుండా.. కొన్ని నెలల పాటు నెలసరి రావడం ఆగిపోయిందంటే మోనోపాజ్ దశ మొదలైనట్టే. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఉత్సాహం తగ్గిపోతుంది. లైంగికాసక్తి తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.

ఈ మోనోపాజ్ కచ్చితంగా 40 దాటితేనే వస్తుందని చెప్పలేం. కొందరకి 30ఏళ్లకే ప్రారంభం అవుతుంది. మరి కొందరి 50దాటాక మొదలౌతోంది. కాకపోతే దాదాపు వయసు 40 దాటిందంటే.. మోనోపాజ్ దశ మొదలయ్యే స్టేజికి చేరుకున్నట్లు సంకేతం. సంతానం కలిగే అవకాశాలు మెనోపాజ్ తో పూర్తిగా ముగిసిపోతాయి. ఎందుకంటే ఒవేరియన్ పనితీరు ఆగిపోయి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కనుక. యవ్వనం ప్రారంభమైన దగ్గర నుంచి నెలనెలా వచ్చే పీరియడ్స్ మెనోపాజ్ తో ఆగిపోతాయి. దాంతో ఇకపై గర్భధారణకు అవకాశం ఉండదు. మెనోపాజ్ దశ ప్రారంభంలో క్రమం తప్పి పీరియడ్స్ వస్తుంటాయి.

అధికంగా రక్తస్రావం లేదా కొంచెమే రక్తస్రావం కనిపిస్తుంది. అంతేకాదు, ఒక పీరియడ్ నుంచి తదుపరి పీరియడ్ కు మధ్య సమయం పెరిగిపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు. మహిళల్లో నెలలపాటు పీరియడ్స్ ఆగడం సాధారణంగా రెండు సందర్భాల్లోనే జరుగుతుంది.