Vitiligo: ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అందులో ఒకటి బొల్లి వ్యాధి. ఈ వ్యాధి అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ వ్యాధి చర్మంపై కనిపిస్తుంది. చర్మంపై ఈ వ్యాధి సోకటం వల్ల చర్మం యొక్క వర్ణం అనేది మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటుంది.

దీనివల్ల చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇక ఇది మొదట చిన్నచిన్నగా వ్యాపించి ఆ తర్వాత శరీరం మొత్తం పాకేలా చేస్తుంది. ఇక ఈ వ్యాధి ముందుగా చేతులు, ముఖం, పాదాలపై వ్యాపించగా ఆ తర్వాత తల వెంట్రుకలకు, నోటి లోపలికి కూడా వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధిని ముందుగానే చిన్న చిన్నగా ఉన్నప్పుడు గుర్తించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేదంటే శరీరం అంతట వ్యాపించి శరీర అందాన్ని పాడు చేసే విధంగా చూపిస్తుంది.

అయితే ఈ వ్యాధికి కొన్ని రకాల లక్షణాలు, కారణాలు ఉన్నాయి. మెలనోసైట్స్ కణాలు అనేవి చర్మరంగుని నిర్ణయిస్తాయి. ఇవి మెలనిన్ అనే పిగ్మెంటును తయారు చేస్తుంది. ఇక ఈ కణాలు ఎక్కువగా ఉన్నవాళ్ల చర్మం నల్లగా ఉంటుంది. ఇక తక్కువగా ఉన్న వాళ్లకు చర్మం తెల్లగా ఉంటుంది. అయితే ఈ కణాలపై యాంటీ బాడీ లు దాడి చేయటం వల్ల బొల్లి వ్యాధి వ్యాపిస్తుంది.

దీంతో మనిషి ఏ రంగులో ఉన్న కూడా ఈ వ్యాధి శరీరం అంతట వ్యాపించి తెల్లగా మారుతుంది. అయితే ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఇతరుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువగా మానసికంగా బాధపడటం వల్ల, ఇతర రసాయన ప్రభావాల వల్ల, ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి వ్యాపించవచ్చని తెలుస్తుంది.

ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది. వ్యాధి వల్ల వచ్చిన తెల్ల మచ్చలను పోగొట్టేందుకు సోరాలెన్ విత్ లైట్ థెరపీ ఉంది. ఇక దీనిని ఫొటో కీమోథెరపీ అంటారు. అయితే ఈ వ్యాధి ప్రారంభంలో చూపించుకోవడం వల్ల కొంత మార్పు ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా దీని ప్రభావం ఉంటే మాత్రం నివారించడం కష్టం.