Dussehra : దసరా రోజు ఇవి తింటే.. అదృష్టం కలిసి వస్తుందట..

దసరా భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పండుగలలో Dussehra ఒకటి. ఈ యేడు అక్టోబర్ 15 న పండుగ వస్తుంది. ఉత్తరం నుండి దక్షిణ, తూర్పు వరకు, ప్రతి రాష్ట్రం దాని స్థానిక రుచికరమైన వంటకాలతో ఈ  పండుగను జరుపుకుంటుంది.

Unique Dussehra recipes that are believed to bring good luck

భారతదేశంలో, ఆహారం, పండుగలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. అందుకే ఇంట్లో తయారుచేసిన పండుగ, పిండి వంటలంటే వాటి రుచే వేరు. అలాగని ప్రతీ పండగకు ఒకేరకం చేయరు. పండగల్ని బట్టి చేసే పదార్థాలు మారుతుంటాయి. దీనికి దసరా లేదా విజయదశమి మినహాయింపు కాదు.

Unique Dussehra recipes that are believed to bring good luck 

దసరా భారతదేశంలో అత్యంత ప్రముఖమైన పండుగలలో Dussehra ఒకటి. ఈ యేడు అక్టోబర్ 15 న పండుగ వస్తుంది. ఉత్తరం నుండి దక్షిణ, తూర్పు వరకు, ప్రతి రాష్ట్రం దాని స్థానిక రుచికరమైన వంటకాలతో ఈ  పండుగను జరుపుకుంటుంది. కొన్ని రకాల homemade foodsను దసరా రోజు తింటే అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన దసరా వంటకాలు.. 

దాల్ పరాఠా, ఖీర్
యుపిలో, ​Dal Paratha and Kheer ల భోగ్ లేకుండా పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. వండిన చన దాల్, క్యారమ్ గింజలు, ఉప్పుతో చేసిన పరాటాలు దసరా ఉదయం ప్రార్థన సమయంలో దేవుడికి బియ్యం ఖీర్‌తో వడ్డిస్తారు. ఈ ఆహారాన్ని తినడం వల్ల కుటుంబంలో అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. 

Unique Dussehra recipes that are believed to bring good luck

మోతిచూర్ లడ్డూ
లడ్డూలపై హనుమంతుడి ప్రేమ మనందరికీ తెలుసు. దసరా నాడు, హనుమంతుడికి mootichoor laddoo నైవేద్యం.  దసరా నాడు దేశీ నెయ్యి మోటిచూర్ లడ్డూ తింటే జీవితంలో ఆనందం,  తీపి లభిస్తుందని నమ్ముతారు. 

స్వీట్ దోశ 
ఇది కర్ణాటకలో ఒక ప్రసిద్ధ రుచికరమైన వంటకం. దసరా రోజున ఒక పవిత్రమైన ఆహారంగా Sweet Dosa ను పరిగణిస్తారు. బెల్లం, కొబ్బరి, బియ్యం పిండి,  గోధుమ పిండితో చేసిన ఈ వంటకాన్ని దసరా నాడు ప్రసాదంగా కూడా అందిస్తారు. 

పాన్
దసరా నాడు తినే మరో ఆహార పదార్థం పాన్. హనుమంతుడికి తమలపాకును సమర్పించడం శ్రేయస్కరం అని నమ్ముతారు. పాన్ అనేది గౌరవం, ప్రేమకు సంకేతంగా చెబుతారు. ఇది 'చెడుపై మంచి విజయం' న్ని సంబరం చేసుకునే క్రమంలో paan శుభ సంకేతంగా చెబుతారు. యుపి, బీహార్‌లో, ఈ రోజు పాన్ తినడం బాగా ప్రసిద్ధి చెందింది.

దహి
మనదేశంలో ఏదైనా కొత్తగా ప్రారంభించేముందు పెరుగు-చక్కెర తినే అలవాటు ఉంది. ఈ అలవాటు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దసరా పండుగలో కూడా ఈ పద్ధతిని పాటిస్తారు. దుర్గాదేవికి పెరుగును నైవేద్యంగా పెడతారు. చరిత్రకారుల ప్రకారం, ఒరిస్సాలోని మహిళలు వండినఅన్నాన్ని నీటిలో నానబెట్టి, దాన్ని అమ్మవారికి పెరుగుతో పాటు నైవేద్యంగా పెడతారు. దీన్ని Ravana dehan కు సంబంధించిన ఆచారంగా నిర్వహిస్తారు. 

Unique Dussehra recipes that are believed to bring good luck

రసగుల్లా 
పశ్చిమ బెంగాల్‌లో విజయదశమి నాడు రసగుల్ల తినడం అదృష్టంగా భావిస్తారు. పాలు, చెన్న, పంచదారతో తయారు చేసిన రసగుల్లాలు దసరా, నవరాత్రి రెండింటికీ సిటీ ఆఫ్ జాయ్‌లో ప్రత్యేక నైవేద్యంగా పేర్కొంటారు. ​Rasgulla అనేక రుచులలో లభిస్తుంది. 

Unique Dussehra recipes that are believed to bring good luck

జలేబి,  ఫఫ్దా
గుజరాతీ వంటకాల ఈ ప్రసిద్ధ కలయిక దసరా రోజున కూడా తప్పనిసరిగా ఆస్వాదిస్తారు. శ్రీరాముడు ఇప్పుడు జలేబి అని పిలువబడే షష్కులి అనే తీపిపదార్థాన్నిఇష్టపడేవాడని నమ్ముతారు. దీనిమీద రాముడికి ఎంత మక్కువ అంటే Jalebi తిని రావణుడిపై తను సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడట. హిందూ మత గ్రంథాల ప్రకారం, ఫఫ్దా జలేబితో కలిపారు.  ఎందుకంటే ఎవరైనా శనగ పిండిఉపయోగించి తయారుచేసిన పదార్థాలు తిని ఉపవాసం ముగించాలి. 

Navratri: శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు... రాజ రాజేశ్వరిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు, ఈరోజు నైవేద్యం ఇదే!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios