Heart Attack risk : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో గుండెపోటుతో చనిపోయే వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. ప్రస్తుతం అన్ని వయసుల వారూ గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం.. గుండెపోటు ఎక్కువగా కొన్ని బ్లడ్ గ్రూప్ వారికే వస్తుందట. అవేంటంటే..? 

Heart Attack risk : 2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మరణానికి దారి తీస్తున్న పది ప్రధాన కారణాల్లో హృదయ సంబంధ వ్యాధులు (Cardiovascular diseases) మొదటి ప్లేస్ లో ఉన్నాయి. ఈ డేటా ప్రకారం.. ప్రతి ఏటా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం, హార్ట్ స్ట్రోక్, వంటి గుండె సంబంధిత రోగాల కారణంగా ఎంతో మంది చనిపోతాన్నారట. చెడు జీవన శైలి, అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల గుండెపోటు సంభవిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే కొత్త అధ్యయనం ప్రకారం.. కొన్ని బ్లడ్ గ్రూప్ వారికే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఏయే బ్లడ్ గ్రూప్ వారి ఈ లీస్ట్ లో ఉన్నారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

ఇతర బ్లడ్ గ్రూపుల వారితో పోల్చితే నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వారికే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలుపుతోంది. American Heart Association లో ప్రచురించిన ఆర్టిరియోస్క్లెరోసిస్, థ్రింబోసిన్ మరియు వాస్కులర్ బయాలజీ అనే అధ్యనయం 400,000 మందిపై ఈ పరిశోధన జరిపింది. ఇందులో తేలిందేంటంటే... బ్లడ్ గ్రూప్ ‘ఎ’ లేదా బ్లడ్ గ్రూప్ ‘బి’ ఉన్నవారికి బ్లడ్ గ్రూప్ ‘ఓ’ వారికంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. 

European Society of Cardiology కి చెందిన పరిశోధకులు నిర్వహించిన మరో అధ్యయనంలో బ్లడ్ గ్రూప్ ఓ కాని వ్యక్తులు కరోనరీ, కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్, గుండెపోటు వచ్చే ప్రమాదం 9 శాతం ఎక్కువగా ఉందని స్పష్టం చేస్తోంది. 

బ్లడ్ గ్రూప్ బి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వారితో పోల్చితే బ్లడ్ గ్రూప్ బి ఉన్నవారికే గుండెపోటు (Cardiovascular Death) వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

అధ్యయనం ఏం చెబుతోంది..? 
బ్లడ్ గ్రూప్ ‘ఓ’గ్రూపుతో పోల్చితే బ్లడ్ గ్రూప్ ‘ఎ’ ఉన్నవారికే గుండె ఆగిపోయే ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గుండెపోటు రెండు రకాలు. ఒకటి గుండె పోటు, రెండోది గుండె వైఫల్యం. అయితే గుండెపోటు అకస్మత్తుగా సంభవించినప్పుడు రోగికి చికిత్స పొందే అవకాశమే ఉండదు. గుండె పోటు కాలక్రమేణా గుండె వైఫల్యానికి దారిస్తుంది. 

పరిశోధకులు బ్లడ్ గ్రూపులైన ‘ఎ’, ‘బి’ వారిని బ్లడ్ గ్రూప్ ‘ఓ’వారితో పోల్చారు. దీనిప్రకారం.. ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చితే బ్లడ్ గ్రూప్ ‘బి’ వ్యక్తులకే గుండెపోటు ప్రమాదం 15 శాతం ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి బ్లడ్ గ్రూప్ బి వ్యక్తులు బ్లడ్ గ్రూప్ ఓ వ్యక్తుల కంటే గుండె వైఫల్యానికి గురయ్యే అవకాశం 11 శాతం ఎక్కువగా ఉంది. గుండె పోటు, గుండె వైఫల్యం రెండూ కూడా గుండె జబ్బులే. కానీ గుండె పోటు అకస్మాత్తుగా సంభవిస్తుంది. కానీ గుండె వైఫల్యం మాత్రం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.