ఇంట్లోకి పాములు రావడానికి ఈ మొక్కలే కారణం.. వెంటనే తీసేయండి..
అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణాలు జనాల మధ్యకు రావడం ఇటీవల ఎక్కువైంది. క్రూరమృగాల మొదలు చిన్న చిన్న పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. విషపూరితమైన పాములు ఇంట్లోకి ప్రవేశించడం ఎంత ప్రమాదకరమే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సాధారణంగా పాములు ఇళ్లలోకి రావడానికి కొన్ని రకాల మొక్కలు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
చలికాలం, వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి రావడం చూస్తునే ఉంటాం. వెచ్చదనాన్ని కోరుకునే పాములు ఇంటి మూలల్లో, మెట్ల కింద తలదాచుకుంటాయి. సాధారణంగా పాములు ఇంట్లోకి రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం. ఇంటి ముందు పాత టైర్లు, పాత సామాన్లు, మురికి కాల్వల్లో వదిలే పైపులు మూసి లేకపోవడం వల్ల పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని రకాల మొక్కల వల్ల కూడా పాములు అట్రాక్ట్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నైప్రస్..
ఇంటి ఆవరణలో నైప్రస్ మొక్కలు ఉంటే పాములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చూడ్డాకానికి అందంగా, దట్టంగా కనిపించే ఈ మొక్కలను ప్రజలు డెకరేషన్ కోసం ఇంట్లో పెంచుతుంటారు. అలంకరణ మొక్కగా పెంచుకునే ఈ చెట్టు దట్టమైన ఆకులు పాములను ఆకర్షిస్తాయి. అలాగే ఈ మొక్కలో పాములు సులభంగా దాచుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచకూడదని చెబుతుంటారు.
నిమ్మకాయ మొక్కలు
నిమ్మకాయ చెట్లు ఉండే చోట కూడా పాములు ఎక్కువగా వస్తుంటాయి. నిమ్మకాయ చెట్టులో ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి. దీని కారణంగా నిమ్మకాయ చెట్టు దట్టంగా మారుతుంది. ఈ దట్టమైన ఆకుల కారణంగా ఎలుకలతో పాటు పలు రకాల కీటకాలు నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. దీంతో పాములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మ చెట్టు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
మల్లెపువ్వులు..
సువాసనను వెదజల్లె మల్లె పువ్వుల చెట్లు ఉన్నా పాములు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మల్లెపువ్వుల మొక్కల శాఖలు ఎక్కువగా ఉంటాయి. చెట్టు దట్టంగా మారవడంతో పాములు, తేళ్లు నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
లవంగం
సుగంద ద్రవ్యాల్లో ఒకటైన లవంగం మొక్కలు కూడా పాములను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకుంటే పాములు ఆకర్షితమయ్యే అవకాశాలు ఉంటాయి. లవంగం మొక్కల ప్రారంభంలో పాములు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.
చందనం మొక్కలు
చందనం మొక్కలు ఎక్కువగా ఉండే చోట కూడా పాములు వస్తుంటాయి. పొడవుగా ఉండే చందనం చెట్టు నీడలో పాములు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అలాగే ఈ చెట్టు ఉండే చోట వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఇది కూడా పాములను అట్రాక్ట్ కావడానికి కారణంగా చెప్పొచ్చు.