పొగరాయుళ్లకు అక్కడ వణుకే.. రూ. రెండు లక్షల ఫైన్, రెండేళ్లు జైలు శిక్ష..
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. సిగరెట్ పెట్టపైనే ఈ విషయాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంటారు. అయితే పొగరాయళ్లు మాత్రం స్మోకింగ్ అలవాటును వదిలి పెట్టరు. అయితే ఆరోగ్యానికి హాని చేసే స్మోకింగ్‌పై కొన్ని దేశాల్లో నిషేధం ఉందని మీకు తెలుసా.?
పొగతాగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిందే. స్మోకింగ్ కిల్స్ అని తెలిసినా ఆ అలవాటును మానుకోరు. అయితే ప్రభుత్వాలు పొగాకు మంచిది కాదని ప్రచారాలు చేస్తారు. కానీ.. పొగాకు నిషేధించరనే అనుమానం రాకమానదు. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో స్మోకింగ్‌ను పూర్తిగా నిషేధించారు. స్మోకింగ్ చేయాలంటే భయపడేలా చట్టాలను రూపొందించారు. ఇంతకీ ఏయే దేశాల్లో స్మోకింగ్‌పై నిషేధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత దేశానికి పొరుగు దేశమైనా భూటాన్‌లో స్మోకింగ్‌ను పూర్తిగా నిషేధించారు. ఇక్కడ 2024 నుంచి ధూమాపానాన్ని నిషేధించారు. భూటాన్‌లో పొగతాగడం నేరంగా పరగణిస్తారు. ఇక కొలంబియాలో కూడా స్మోకింగ్‌పై నిషేధం ఉంది. 2009 నుంచి కొలంబియాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంలో ఉంది. మన దేశంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్‌పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
ఆ దేశంలో కఠినమైన నిబంధనలు..
స్మోకింగ్‌పై నిషేధం ఉన్న దేశాల్లో కోస్టారికా ఒకటి. 2012 నుంచి ఈ దేశంలో ధూమపానాన్ని నిషేధించించారు. ఇక మలేషియాలో ధూమపానంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ దేశంలో ఆసుపత్రులు, విమానాశ్రయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ధూమపానంపై పూర్తి నిషేధం ఉంది. ఈ ప్రాంతాల్లో స్మోకింగ్ చేస్తే రూ. 2 లక్షల వరకు జరిమానాతో పాటు, 2 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు.
తాజాగా ఈ దేశంలోకూడా..
స్మోకింగ్‌ను నిషేధించిన జాబితాలో తాజాగా కొత్త దేశం వచ్చి చేరింది. ఇటలీలో బహిరంగ ధూమపానం నిషేధాన్ని అమలు చేశారు. 2025 జవనరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇటలీ రాజధాని మిలాన్‌లో ఎవరైనా బహిరంగంగా ధూమపానం చేస్తే 40 నుంచి 240 యూరోల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 3500 నుంచి రూ. 21,000 వరకు ఫైన్ కట్టాల్సిందే.
మరికొన్ని దేశాల్లో..
వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్‌ను నిషేదించింది. వీటిలో నార్వే, న్యూజిలాండ్, స్వీడన్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో పూర్తిగా స్మోకింగ్‌ను నిషేధించారు. కాగా ఐర్లాండ్, జింబావ్వే, ఉగాండా, స్వీడన్ వంటి దేశాల్లో పబ్లిక్ ప్లేసెస్‌లో స్మోకింగ్‌ను నిషేధించారు. ఇక ఫిన్‌లాండ్, ఐల్యాండ్ దేశాల్లో రెస్టారెంట్స్, బార్స్‌లో స్మోకింగ్ బ్యాన్ చేశారు.
క్యాన్సర్ ప్రమాదం..
స్మోకింగ్ అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. స్మోకింగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని 20 రెట్లు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు స్మోకింగ్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిగరెట్ తాగే అలవాటు ఉన్న వారి ఆయుష్షు క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు.
ఒక్క సిగిరెట్ 17 నిమిషాల ఆయుష్షును హరిస్తుందని పరిశోధనల్లో తేలింది. మహిళల్లో అయితే ఒక సిగరెట్ తాగితే 22 నిమిషాల ఆయుష్షు కోల్పోతారని పరిశోధనల్లో వెల్లడైంది. 1996లో మహిళలు రోజుకు సగటున 13.6 సిగరెట్లు తాగేవారు. ఇప్పుడు సిగరెట్లు తాగే వారి సంఖ్య చాలా పెరిగిపోయిందని గణంకాలు చెబుతున్నాయి.