Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి తర్వాత అమ్మాయిలు బరువుపెరగడానికి కారణం ఇదే..

అమ్మాయిలు లావుగా మారడానికి గల కారణాల్లో మొదటిది లైంగిక కలయిక. దీనివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుందట. అందుకే అనూహ్యంగా బరువు పెరగడం లాంటివి జరుగుతాయని చెబుతున్నారు.
 

these are the reasons behind women gain weight after marriage
Author
Hyderabad, First Published Aug 27, 2018, 4:20 PM IST

అప్పటివరకు ఎంతో నాజుకుగా ఉండే అమ్మాయిలు.. పెళ్లి జరిగిన సంవత్సరం, రెండు సంవత్సరాల్లో లావుగా అయిపోతుంటారు. ఇలాంటి మార్పు నూటికి 70శాతం మంది అమ్మాయిల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇలా లావు కావడానికి చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.  ఆ లావు.. అత్తారింట్లో కూర్చొని హాయిగా తినడం వల్ల వచ్చింది కాదని నిపుణులు చెబుతున్నారు.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయిలు లావుగా మారడానికి గల కారణాల్లో మొదటిది లైంగిక కలయిక. దీనివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుందట. అందుకే అనూహ్యంగా బరువు పెరగడం లాంటివి జరుగుతాయని చెబుతున్నారు.

శారీరిక కలయిక కారణంగా అమ్మాయిల నడుము వద్ద కొవ్వు పేరుకుపోయి బరువు పెరగుతారని వారు చెబుతున్నారు. అయితే అదొక్కటే కారణం కాదట. అప్పటి వరకు పుట్టినింట్లో తినే తిండికి, అత్తారింటిలో తినే తిండికి చాలా మార్పులు ఉంటే కూడా ఇలా శరీరంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు. 

పెళ్లి జరిగింది అంటే.. అమ్మాయిల్లో రెస్పాన్సిబులిటీస్ కూడా పెరిగిపోతాయి. ఇంట్లో సభ్యులు అందరూ తిన్న తర్వాత మాత్రమే తినాలి, సరైన నిద్ర లేకపోవడం, పిల్లలు పుట్టడం, ఆలోచనలు ఎక్కువవడం, ఒత్తిడి లాంటివి కూడా శరీర బరువు పెరగడానికి కారణమౌతాయంటున్నారు నిపుణులు.

సమయానికి ఆహారం తీసుకొని యోగా, వ్యాయామం లాంటివి చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios