Feet Swelling : పాదాల వాపు సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో నలుగురిలోకి వెల్లడానికి కూడా ఇష్టపడని వారు చాలా మందే ఉన్నారు. మీరు కూడా ఈ పాదాల వాపులతో బాధపడుతున్నారా.. అయితే దానికి కారణాలు ఇవే కావొచ్చు. మరి వాటిని తగ్గించాలంటే.. 

Feet Swelling : తరచుగా పాదాలు వాస్తుండటం చాలా మందిలో చూస్తూనే ఉంటాం. తరచుగా పాదాలు ఎందుకు వాస్తాయో చాలా మందికి తెలియదు. కానీ ఎక్కువ సేపు కూర్చుంటే పక్కాగా కాళ్లు వాస్తాయని చాలా మంది అంటూ ఉంటారు. ఈ వాపులు పెద్ద సమస్య కాదు. సో లైట్ అంటూ ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ఈ వాపు చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ వాపులు మనలోని అనారోగ్య సమస్యలకు సంకేతాలట. కాగా ఈ వాపు ఎక్కువగా జర్నీ చేస్తే కూడా వస్తాయి. ఇది సాధారణం. అలాగే గర్భిణీల పాదాలు కూడా వాస్తాయి. అది కూడా సర్వ సాధారణం. కానీ కొంత మందికి ఊరికే పాదాలు వాపులు వస్తాయి. 

ఇలా వచ్చిన వారు ఫ్యూచర్ లో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రక్త పోటులో వ్యత్యాసం, కిడ్నీల సమస్య, గుండె పనితీరు మెరుగ్గా లేకుంటేనే పాదాల వాపులు వస్తాయని గుర్తుంచుకోవాలి. పాదాలు వాసినయంటే మీ కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోవడమో, గుండె ఆరోగ్యం బాలేదనో అర్థం చేసుకుని వైద్యుడిని సంప్రదించి.. వాటికి సంబంధించి టెస్టులు చేయించుకోవాలి. వాటి పనితీరు మెరుగ్గా ఉందో లేదో నిర్దారించుకోవడం చాలా ముఖ్యం. కాగా శరీరంలో లవణాలు అధికంగా ఉంటే కూడా పాదాలు వాస్తాయట. నీళ్లను అధికంగా తాగుతూ ఉంటే ఈ అధిక లవణాల సమస్య తగ్గుతుంది. ఇకపోతే పాదాల్లో చేరిన నీటిని తొలగించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే.

గోరు వెచ్చని నీళ్లను ఒక బకెట్ లో పోసి అందులో గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేయండి. అందులో పాదాలను పెడితే వాపు మటు మాయం అవుతుంది. దీనితో పాటుగా గ్లాస్ నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే కూడా పాదాల వాపు నయమవుతుంది. అలాగే బార్లీ నీళ్లను తాగడం వల్ల కూడా పాదాల వాపు రాదు. కీరదోస జ్యూస్ వల్ల కూడా పాదాలు వాపు దరిచేరదు. వాపు ఉంటే దీన్ని తాగడం వల్ల వాపు తగ్గుతుంది. పాదాల్లో ఉండే అధిక నీరు బయటకు పంపబడుతుంది. వీటితో పాటుగా పాదాల వాపును తగ్గించడంలో ధనియాలు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో Anti-inflammator లక్షణాలు ఉండటంతో పాదాల వాపు తొందరగా తగ్గుతుంది.

 కొన్ని నీళ్లను తీసుకుని అందులో మూడు టీస్పూన్ ధనియాల పొడిని వేయ్యాలి. ఆ నీరు సగం అయ్యే వరకు మంటపై మరిగించాలి. ఆ తర్వాత వాటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఈ వాపు సమస్యనుంచి పూర్తిగా ఉపశమనం పొందచ్చు. ఇలా రోజుకు కనీసం రెండు సార్లైనా చేయాలి. ఎక్కువ సేపు కూర్చుంటే కూడా పాదాలు వాపుకు గురవుతాయి. అందుకే పని చేస్తున్నా మధ్య మధ్యలో కాస్త దూరం నడవడం మంచిది. పాదాలకు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా లేకుంటే ఇలా వాస్తాయి. అందుకే పాదాల వ్యాయామం చేయాలి. తద్వారా వాపు రాదు. అలాగే పాదాలు వాస్తే నువ్వుల నూనెతో మర్ధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తే కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పుడు వీలైనంత తగ్గించండి. పడుకునేటప్పుడు పాదాలు ఎత్తుగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే పాదాల కింద దిండును పెట్టుకోవాలి. ఇలా చేస్తే పాదాల వాపులు, నొప్పులు తగ్గుతాయి.