Broken Heart:ఇలాంటి మహిళలే బ్రోకెన్ హార్ట్ బారిన పడుతున్నారు.. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటో తెలుసా..?


Broken Heart: ఆడవారి మనస్సు చాలా సున్నితమైనది.  అందుకే చిన్న చిన్న సమస్యలకు కూడా క్రుంగిపోతుంటారు. మరికొంతమంది ఆడవారు ఎంత పెద్ద సమస్యలనైనా తట్టుకుంటారు.. కానీ మానసిక హింసను మాత్రం అస్సలు తట్టుకోలేరు. అలాంటి మహిళలకు గుండె పోటు వచ్చే  ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 
 

Such women are suffering from broken heart  Do you know what a broken heart is

Broken Heart: మహిళలకు ఎలాంటి కఠిన సమస్యలైనా ఎదుర్కోగల శక్తి ఉంటుంది. అందుకే కదా.. ఎన్ని కష్టాలెదురైనా కుటుంబాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తుంది. ఎన్ని సమస్యలైనా ఎదురుకాని.. వాటికి మాత్రం తలవంచరు. కానీ ఆడవారి గుండె చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే కంటికి కనిపించని గాయాలను, కుటుంబంలో పెట్టే మానసిక ఇబ్బందులను ఎదుర్కోలేదు. కానీ ప్రస్తుత కాలంలో కూడా ఆడవారిపై హింస కొనసాగుతూనే ఉంది. హింస, మానసిక ఒత్తిడి ఇవి ఎవ్వరికీ కనిపించని అతిపెద్ద గాయాలు. వీటికి గురైన ఆడవారికి బ్రోకెన్ హార్ట్ అని పిలవబడే  Heart attack వచ్చే ప్రమాదముందని ఓ కొత్త అధ్యయనం తేల్చి చెబుతోంది. భారమైన భావోద్వేగాలకు గురైనప్పుడు మహిళలు బ్రోకెన్ హార్ట్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. In a study by the Karolinska Institutet in Sweden ప్రకారం.. భావోద్వేగాల మూలంగా శరీరంలో తలెత్తే హార్మోన్ల లెవెల్స్ యే కారణమని చెబుతోంది. మానసికంగా ఒత్తిడి పెరిగితేనే గుండె పోటు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. 

లక్షణాలు:  బ్రోకెన్ హార్ట్ అనగానే చాలా మంది లవ్ ఫెయిల్యూర్ ద్వారా వచ్చే పెయిన్ అని భావిస్తుంటారు. అది అస్సలు కానే కాదు. గుండెల్లో మోయలేని, భరించలేని భాద కలిగినప్పుడు ఆడవారు తీవ్రమైన భావోద్వేగానికి గురవుతుంటారు. దీనివల్ల వారు గట్టిగా ఏడవడం, మౌనంగా కన్నీరు కార్చడం, గట్టిగట్టిగా అరవడం లాంటివి చేస్తుంటారు. గుండెల్లో అంతులేని భాద కలిగినప్పుడే ఇలాంటి భావోద్వేగానికి గురవుతుంటారు. ఇవి ఎక్కువైనప్పుడే బ్రోకెన్ హార్ట్ బారిన పడతారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది గుండె పోటులానే ఉంటుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో నొప్పి లక్షణాలు వారిలో కనిపిస్తాయి. ఇది మానసిక ఒత్తిడి కారణంగా జరుగుతుంది. కానీ ధమనులు మూసుకుపోవడంతో కాదు.

దీనికోసం.. హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడుతున్న మహిళలను ఎంచుకున్నారు. వీరిపై అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. కాగా ఈ హార్ట్ ఎటాక్ ఉన్న పదిశాతం ఆడవారిలో గుండె blood vessels లో అనారోగ్య సమస్యలేమీ లేవని గుర్తించారు. అంటే హార్ట్ ఎటాక్ వస్తే రక్తం గడ్డలు కట్టడం, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ వీరిలో అలాంటి సమస్యలేమీ కనిపించలేదు. కాగా ఆడవారిలో ఈ హార్ట్ ఎటాక్ కు అసలు కారణం బ్రోకెన్ హార్ట్  యే నని తేల్చి  చెప్పారు. దీనికారణంగానే హార్ట్ పనితీరు మెరుగ్గా ఉండటం లేదని పేర్కొంటున్నారు. ఈ సమస్యను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. సరైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios