Asianet News TeluguAsianet News Telugu

Health: కంటినిండా నిద్రలేకపోతే జ్ఞాపక శక్తి తగ్గుతుందా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

Health: మ‌నిషి ఆరోగ్యంగా ఉండ‌టానికి స‌రైన ఆహారం తీసుకోవ‌డంతో పాటు త‌గినంత నిద్ర కూడా అవ‌స‌రం. కంటినిండ నిద్ర లేక‌పోతే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా శ‌రీరానికి త‌గినంత నిద్ర లేక‌పోతే.. మెద‌డుపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. 
 

Sleep affects memory, brain boosting works
Author
Hyderabad, First Published Jan 12, 2022, 4:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

Health: నిద్రతోనే ఆరోగ్యం. కంటినిండా నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఎలాంటి జబ్బులు లేకుండా జీవించేది. ఇదే ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్న ఆరోగ్య ఫార్ములా. అవును మరి కోట్లు వెనకేసుకున్న కుభేరుడైనా.. పూట గడవడం కోసం కష్టంచే కష్టజీవికైనా నిద్ర ఎంతో అవసరం. అందుకే బెడ్ కొనగలం కానీ నిద్రను కొనలేమని  మాట ఊరికే రాలేదు కదా. ప్రస్తుత కాలంలో నిద్ర లేమితో బాధ‌పడేవారు బాగానే  ఉన్నారు. కారణాలేమైనా నిద్రపోకపోవడంతో చాలా మంది అనేక రోగాల భారిన పడుతున్నారు. మాకు రాత్రుళ్లు నిద్ర రావడం లేదు, ఊరుకురికే మెలుకువ వస్తుంది, ఒక్క కునుకు మాత్రమే నిద్రపోతున్నామని డాక్టర్లను సంప్రదించి వారి బాధలను చెప్పుకున్న వారెందరో ఉన్నారు.

నిద్రపోని వారిలో రకరకాల రోగాలు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా నిద్రలేమితో మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని తాజా పరిశోధనలు వెల్ల‌డిస్తున్నాయి. కంటినిండా నిద్రపోని వారి ఆలోచనా శక్తి మందగిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  రోజుకు ఒక వ్యక్తి ఎన్ని గంటలు పడుకోవాలి..? ఎన్ని గంటలకు తక్కువకాకుండా నిద్రపోతే వచ్చే ఉపయోగాలేంటి..?  తక్కువ సమయం నిద్రిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి..?  అనే ప‌లు విషయాలపై శాస్త్రవేత్తలు తాజాగా పరిశోధనలు జరిపారు. 

వాటిలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దవారైనా.. చిన్నపిల్లలైనా సరే రోజూ సగటున 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇలా నిద్రించడం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం పడుతుంది. దాంతో మనం చురుగ్గా పనిచేయగలుగుతాం. అయితే ఈ సగటు నిద్ర లేకపోతే ఆల్జీమర్స్ వ్యాధి భారిన పడే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటుగా జ్ఞాపకశక్తి మందగించడం, గందరగోళానికి గురికావడం, ఏ విషయాన్ని అంత తొందరగా అర్థం చేసుకోకపోవడం, లేట్ గా విషయాన్ని రిసీవ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారని పరిశోధకులు వెల్ల‌డించారు. ఈ సింప్టమ్స్ అన్నీ ఆల్జీమర్స్ లక్షణాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఈ పరిశోధనలో నిద్రకు ఆల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉందని రుజువైంది. ఇలాంటి వ్యాధి భారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు కనీసం ఏడు నుంచి 8 గంటల నిద్ర పోవాలని సూచిస్తున్నారు. రాత్రుళ్లు నిద్రపట్టకపోతే శ్వాస పద్ధతిని పాటించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  అంటే ఎలాంటి శబ్దం లేని ప్లేస్ లో ఉండాలి. ఈ పద్దతిని పాటిస్తే నిద్ర తొందరగా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే పడుకునే ముందు గోరు వెచ్చటి పాలు తాగినా మంచిగా నిద్రవస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాత్రి సమయాల్లో ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువ సేపు చూడకూడదు. ఫోన్ స్క్రీన్ పై ఉండే వెలుతురు నేరుగా మన కళ్లపై పడి నిద్రను దూరం చేస్తుంది. సో నిద్రపోయే గంట ముందు వాటన్నింటిని మీకు దూరంగా ఉండాలి. అలాగే కడుపు కాళీ లేకుండా చూసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకుంటే కూడా నిద్రలేమి సమస్య నుంచి దూరంగా ఉండొచ్చని వైద్య‌ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios