ముఖం పై మొటిమలకు చెక్ చెప్పండిలా..

మొటిమలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారిలో వస్తాయి. కాబట్టీ అయిల్ ఫుడ్‌ను వీలైనంత వరకూ తగ్గించుకోవడం మంచిది

simple techniques to reduce pimples

ముఖం మీద ఒక్క మొటిమ చాలు అందం పోగొట్టడానికి. అలాంటిది కుప్పలుకుప్పలుగా వచ్చేస్తే. మార్కెట్లో లభించే కొన్ని రకాల క్రీములు వాడటం కారణంగా.. తగ్గినట్టే అనిపించి మళ్లీ రావడం మొదలుపెడతాయి. లేకపోతే.. నల్లటి మచ్చలుగా ఏర్పడతాయి. మరి వీటికి పరిష్కారమే లేదా అంటే.. వంటింటిలో లభించే కొన్నిరకాల పదార్థాలు ఉన్నాయిగా అంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఒకసారి మనమూ లుక్కేద్దామా...

మొటిమలు బాధిస్తుంటే కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గుతాయి.  మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహారాన్ని తగ్గించుకోవాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల మొటిమలు తగ్గుపోతాయి.

టమోటా రసాన్ని మొటిమల మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు. మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తేనె, చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి.

వీటితోపాటు కొన్ని ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మొటిమలు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినేవారిలో వస్తాయి. కాబట్టీ అయిల్ ఫుడ్‌ను వీలైనంత వరకూ తగ్గించుకోవడం మంచిది. మొటిమలు ఉన్నవారు వాటిని సూది, పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చేయడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్‌ను రుద్దుతుంటే కొంచేం ఉపశమనం కలుగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios