చిరునవ్వు.. మనిషి అందాన్ని మరింత పెంచుతుంది. మరి ఆ చిరునవ్వు అందంగా ఉండాలంటే.. పెదాలు కూడా అంతే అందంగా ఉండాలి కదా. పొడిబారిపోయి, నల్లగా ఉంటే.. ఆ పెదాలు అందంగా కనిపించవు కదా. ఎంత లిప్ బామ్, లిప్ స్టిక్ రాసినా.. సహజ అందం ఉండదు. కేవలం ఇంట్లో లభించే సహజమైన పదార్థాలతో పెదాలు అందంగా మెరుస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూసేద్దామా...

నిమ్మ మరియు షుగర్: ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను ఎక్స్ఫోలియెట్ చేసేందుకు తోడ్పడి కొత్త సెల్స్ ను రిస్టోర్ చేస్తుంది. మొదటగా, నిమ్మకాయను తీసుకొని రెండు సగాలుగా కట్ చేసుకోవాలి. ఒక స్లైస్ పైన కాస్తంత షుగర్ ను చల్లుకోవాలి. దీన్ని అప్పర్ మరియు లోయర్ లిప్స్ పై సున్నితంగా సర్క్యూలర్ మోషన్ లో రబ్ చేసుకోవాలి. ఇది పదిహేను నిమిషాల వరకు అలాగే ఉండాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో పెదవులను శుభ్రపరుచుకోండి. ఈ రెమెడీను వారానికి మూడు సార్లు పాటిస్టే పెదాలు మృదువుగా మారతాయి.

నిమ్మ, తేనే మరియు గ్లిజరిన్... నిమ్మ, తేనే మరియు గ్లిజరిన్ ల కాంబినేషన్ అనేది పెదాలపై నుంచి ట్యాన్ ను తొలగిస్తుంది. ఒకటిన్నర టీస్పూన్ల నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మరియు తేనెను ఒక పాత్రలోకి తీసుకోండి. నిద్రపోయే ముందు పెదాలపై ఈ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి ఉదయాన్నే నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే సరిపోతుంది.

నిమ్మ మరియు క్యాస్టర్ ఆయిల్: డార్క్ లిప్స్ సమస్యను ఈ సింపుల్ రెమెడీతో పరిష్కరించుకోవచ్చు. ఒక పాత్రలో, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ను తీసుకోండి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. అవసరమైతే నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి ఉదయాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవచ్చు. లేదంటే పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవచ్చు. ఆ తరువాత లిప్ బామ్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే పెదాలు గులాబి రంగులో అందంగా మారతాయి.