Asianet News TeluguAsianet News Telugu

దాంపత్య బంధం బలోపేతానికి పరస్పర మద్దతు అవశ్యం

 ప్రతి సంబంధం విభిన్నమైంది. కానీ కొన్ని సంబంధాలను నిర్దేశించడానికి మార్గాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉండే భార్యాభర్తలు అనుసరించాల్సిన పద్దతులు, మంచీచెడ్డలు పాటించేందుకు సంకేతాలు ఉన్నాయి

Relationship tips, watch out for these 6 signs to know if you are happy with your partner
Author
Hyderabad, First Published Aug 12, 2018, 1:30 PM IST


హైదరాబాద్: ప్రతి సంబంధం విభిన్నమైంది. కానీ కొన్ని సంబంధాలను నిర్దేశించడానికి మార్గాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉండే భార్యాభర్తలు అనుసరించాల్సిన పద్దతులు, మంచీచెడ్డలు పాటించేందుకు సంకేతాలు ఉన్నాయి. ప్రతి దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో శుభ సమయాలు, దుర్దిన వేళలు ఉన్నాయి. దంపతుల మధ్య అసమ్మతి ఉండకపోవడం అంటేనే శుభ సమయం అన్న సంగతి తెలుసుకుందాం..

భార్యాభర్తలైనా వారికి వ్యక్తిగత సమయం అవసరం ఉన్నది. దంపతుల్లో భర్త గానీ, భార్య గానీ తమ జీవిత భాగస్వామి స్నేహితులతో అంత తేలికగా కలిసిపోరు. తమ జీవిత భాగస్వామి మిత్రులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు విశ్వసించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి కొద్ది నిమిషాల కోసారి తొంగి చూడొద్దు. స్నేహితులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఉంటే మీకు సౌకర్యంగా ఉంటేనే ఆమె స్వేచ్ఛగా తన వ్యక్తిగత సమయాన్ని గడుపగలదని నిర్ధారణ అవుతుంది. అందువల్ల భర్త ఆందోళనకు గురి కావాల్సిన అవసరమే లేదు. 

మీ జీవిత భాగస్వామి ఫోన్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పని చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు రహస్యంగా తొంగి చూసేందుకు పూనుకోవద్దు. భార్యాభర్తలు పరస్పరం ఒకరికి మరొకరు మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామి మద్దతుపై ఆధారపడకుండానే సంబంధ బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఆదర్శ దంపతులు వ్యక్తిగతంగా సమర్థులుగా ఉంటారు. కానీ కీలక సమయాల్లో వ్యక్తిగతంగా ఉన్నా జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతుండటం సహజ పరిణామం. 

భార్యాభర్తల మధ్య చిన్నపాటి చిలిపి తగువైనా లేకుండా వారిద్దరూ నిద్రపోరని నానుడి. దీని వెనుక ఎంతో నిగూఢార్థం దాగి ఉన్నది. ప్రతి దంపతులు పోట్లాడుకున్నా కానీ, వెంటనే కలిసిపోతారు. భార్యాభర్తలుగా మీరిద్దరూ ఒకచోట కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ఇది ఆరోగ్యకర సంబంధానికి సంకేతమని చెబుతారు. 

మీరు, మీ జీవిత భాగస్వామి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నదనుకోండి. మీ మధ్య అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు. దంపతులు ఏకాంతంగా ఉన్నప్పుడు పరస్పరం జోక్‌లు వేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. దంపతుల మధ్య దాపరికానికి తావు లేదు. ఎప్పటికప్పుడు మీ మధ్య సంబంధ బాంధవ్యాలను పరీక్షించుకుంటూ ముందుకు సాగితే సత్ఫలితాలనిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios