చావుకు ముహూర్తం...టైమ్ చూసి ఆక్సిజన్ తీయించుకుంటున్నారు

సాధారణంగా ఏదైనా పని ప్రారంభించే ముందు మంచి ముహూర్తం చూసుకోవడం భారతీయులకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ కొద్దికాలంగా ఇది మరీ విపరీత పోకడలకు పోతోంది. 

muhurtham for death

సాధారణంగా ఏదైనా పని ప్రారంభించే ముందు మంచి ముహూర్తం చూసుకోవడం భారతీయులకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ కొద్దికాలంగా ఇది మరీ విపరీత పోకడలకు పోతోంది. ప్రతి పనికి ముహూర్తంతో పాటు మన చేతుల్లో లేని జనన, మరణాలకు కూడా దీనితో లింక్ పెడుతున్నారు.

ఇటీవలికాలంలో ముహూర్తాలు, జాతకాలు, మోక్షం వంటి అంశాలపై జనానికి నమ్మకం బాగా పెరుగుతోంది.. ప్రసార సాధనాల పాత్ర కావొచ్చు.. లేక మరోకటి కావొచ్చు.. వీటిని నమ్మేవారు అంతకంతకూ పెరుగుతున్నారు.

మంచి ఘడియాల్లో డెలీవరి చేస్తే పుట్టే బాబు మహార్జాతకుడు అవుతాడని..నెలలు నిండకముందే ఆపరేషన్ చేయించేవారి గురించి రోజూ చూస్తూనే ఉన్నాం. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో 11 మంది కుటుంబసభ్యుల బృందం అందరూ ఒకే సమయంలో చనిపోతే మోక్షం ప్రాప్తిస్తుందనే నమ్మకంతో.. సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

తాజాగా తీవ్ర అనారోగ్యంతోనో, వృద్ధాప్యంతోనే ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంటే.. మంచి ముహూర్తంలో దానిని తొలగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులపై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే.. నేరుగా వైకుంఠానికి చేరుతారని మన పురాణాల్లో చెప్పడం కూడా ఇలాంటి వారు సాకుగా చెబుతున్నారు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆది, మంగళ, శుక్రవారాలు, పాడ్యమి, చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, ఆమావాశ్య తిథులు.. చిత్తా, మృగశిర, కృత్తికా, ఉత్తర, ఉత్తరాషాఢ, విశాఖ, పునర్వసు, రోహిణీ, శ్లేష, శషబిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో మరణం మంచిది కాదని ఈ శాస్త్ర పండితులు చెప్తున్నారు. 

మరోవైపు జనం నమ్మకాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు ఈ పద్ధతిని పెంచి పోషిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సాంప్రదాయవాదుల మాత్రం జనన, మరణాలు మన చేతుల్లో లేవని వారు చేసుకున్న పుణ్యఫలాలను బట్టి మరణ ఘడియలు ఉంటాయని.. దాని కోసం ముహూర్తాలు పెట్టించుకోవడాన్ని శాస్త్రం సమ్మతించదని చెబుతున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios