మనదేశంలో అబ్బాయిల సంఖ్య కంటే.. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. తాజా సర్వేలో తేలింది ఏమిటంటే.. డేటింగ్ యాప్ లలో ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట. ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ డేటింగ్ యాప్ లను విపరీతంగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ యాప్ వాడే ఒక్కో అమ్మాయి వెంట..కనీసం ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట.

భారత్ లో డేటింగ్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్‌’ అనే దేశీయ డేటింగ్‌ యాప్‌ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. అమెరికా మహిళలకన్నా ఈ సంఖ్య ఎంతో తక్కువ. అమెరికాలో టిండర్, బంబుల్‌ డేటింగ్‌ యాప్స్‌ను 40 శాతం మంది మహిళలను ఉపయోగిస్తున్నారు. 

విదేశాల్లో డేటింగ్ యాప్స్ ని టైమ్ పాస్ కోసం వినియోగిస్తుంటే.. భారత్ లో మాత్రం సీరియస్ గా డేటింగ్ చేయాలనే వినియోగిస్తున్నారని సర్వేలో తేలింది. 32శాతం మంది సీరియస్ రిలేషన్ కోసం ఈ యాప్స్ లో ట్రై చేస్తుండగా.. 28శాతం మాత్రం కొత్తవారితో పరిచయం కోసం వాడుతున్నారని తేలింది. ఇంకొందరేమో..సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం చేస్తున్నామని తెలిపారు. 18నుంచి 21 వయసుగల అబ్బాయిలు మాత్రం.. అమ్మాయిలతో స్నేహం కోసం ఈ యాప్స్ వినియోగిస్తున్నట్లు తెలపడం విశేషం. 

ఇక పోతే.. ఈ డేటింగ్ యాప్స్ లో చాలా మంది తన నిజమైన డీటైల్స్ పొందరుపరచడం లేదట. అమ్మాయిలు భద్రతను దృష్టిలో పెట్టుకొని ఫేక్ డీటైల్స్ ఇస్తున్నారని తెలిసింది.