పురుషాంగం సైజు గురించి చాలా మంది అబ్బాయిల్లో కొన్ని అపోహలు ఉంటాయి. సైజు చిన్నగా ఉన్నవారు లైంగికంగా తమ భాగస్వామిని సంతృప్తి పరచలేమేమో అన్న బాధ వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇది అపోహే అని నిపుణులు తేల్చిచెప్పారు. అయితే.. సంతృప్తి సమస్య లేకపోయినప్పటికీ.. మరో సమస్య నుంచి మాత్రం వారు తప్పించుకోలేరు అంటున్నారు నిపుణులు.

అంగం పరిమాణం చిన్నగా ఉంటే శృంగారాన్ని ఎంజాయ్ చేసే విషయంలో సమస్యలు రాకపోవచ్చు కానీ.. వారికి సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. 

ఇతరులతో పోలిస్తే అంగం సైజ్ కంటే తక్కువగా ఉండే వారిలోనే సంతాన సమస్యల అధికమని పరిశోధనలో వెల్లడైంది. సెక్సువల్ హెల్త్ క్లినిక్‌కు వెళ్తున్న 815 మందిపై మూడేళ్ల వ్యవధిలో ఈ పరిశోధనలు జరిపారు. 

వంధ్యత్వానికి గురవుతున్న వారిలో అంగం పొడవు 4.92 అంగుళాలుగా ఉందని, ఈ సమస్యలు లేని వారి పురుషాంగం పరిమాణం 5.27 అంగుళాలని అధ్యయనం తేల్చింది. దీనికి గణాంక సంబంధమైన ప్రాధాన్యం ఉందని యూనివర్సిటీ ఆఫ్ ఉతాహ్‌కు చెందిన డాక్టర్ ఆస్టిన్ స్లేడ్ తెలిపారు. అంగం సైజ్ తక్కువగా ఉన్నంత మాత్రాన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమేం లేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.