ఆ విషయంలో భర్తల ప్రవర్తన భార్యలను బాధిస్తోందా?

39 సంవత్సరాల లోపున్న 722 జంటలను అధ్యయనకారులు పరిశీలించారు.  స్టడీలో భాగంగా ఈ జంటలను వారి వైవాహిక జీవిత అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.

latest survey.. wives not getting emotional support from their husbands

భార్య భర్తల బంధం అంటే.. కేవలం శృంగారం మాత్రమే కాదు. ఒకరికి మరొకరు మానసికంగా అండగా ఉండాలి అంటున్నారు నిపుణులు. భర్తల నుంచి మానసికంగా మద్దతు లభించని భార్యలు.. డిప్రెషన్ కి గురౌతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది.  వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తినప్పుడు భార్యలు తీవ్ర ఆందోళలకు గురతౌతున్నారట. ఆ బాధలు పంచుకోవడం కోసం ఒక తోడు కోసం వెతుకుతుంటారట.

న్యూజెర్సీలోని రట్‌గర్స్‌ యూనివర్సిటీ అధ్యయనకారులు చేసిన ఈ సర్వేలో ఈ విషయాలు వెలువడ్డాయి.  ఇందులో 39 సంవత్సరాల లోపున్న 722 జంటలను అధ్యయనకారులు పరిశీలించారు.  స్టడీలో భాగంగా ఈ జంటలను వారి వైవాహిక జీవిత అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఒకరిపట్ల ఒకరు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలాంటి అభిప్రాయాలు ఒకరిపై ఒకరికి ఉన్నాయి, అవి వారి సంసారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయి వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. భర్తల నుంచి మానసిక మద్దతు అందిన భార్యలు ఎంతో  ఆనందంగా ఉంటారని ఇందులో వ్యక్తమైంది. 

భర్త నుంచి మద్దతు స్త్రీకి ఎంతో శక్తిని, సంతృప్తిని ఇస్తాయని అధ్యయనకారులు అభిప్రాయపడ్డారు.  మగవాళ్లు తమ వైవాహిక జీవితం పట్ల పాజిటివ్‌గా ఉన్నారు.  అంతేకాదు భార్యల కన్నా కూడా భర్తలు ఎక్కువగా ఎమోషనల్‌ సపోర్టు పొందుతున్నారు. కానీ మానసిక సపోర్టు ఇచ్చిపుచ్చుకోవడం విషయంలో భార్యాభర్తల మధ్య తేడాలు వస్తున్నాయి.  

దాంపత్యపరమైన సమస్యలు  ఆడవాళ్లతో పోలిస్తే  మగవాళ్లకు  తక్కువగానే ఉన్నాయి.  మొత్తానికి వైవాహిక జీవితం ఆనందంగా సాగనపుడు మగవాళ్లు కోపంతో, ఆడవాళ్లు బాధతో ఉంటారని అధ్యయనకారులు తమ స్టడీలో తేల్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios