సాధారణంగా మనిషి అన్న తర్వాత కొన్ని సందర్భాలలో కోపం రావడం సర్వసాధారణం అయితే కొన్నిసార్లు కొన్ని పనులు జరగకపోవడం వల్ల చికాకుతో కోప్పడుతూ ఉంటారు మరి కొన్నిసార్లు కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ పరిస్థితుల వల్ల కూడా ఇతరులపై కోపం రావడం సర్వసాధారణం అయితే తరచూ ఇలా ఇతరులపై కోప్పడిన, చిన్న విషయానికి పెద్ద విషయానికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న మీరు ఇలాంటి వ్యాధితో బాధపడుతుంటారని అర్థం. మరి కోపం రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే...
పక్షవాతం: పక్షవాతానికి గురైన వారు తొందరగా ఇతరులపై ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే భాగం దెబ్బతిన్నప్పుడు వారిలో మానసిక స్థితి అదుపు తప్పుతుంది తద్వారా నిరాశ నిస్పృహ కోపం బాధ వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.
ఆల్జీమర్స్: ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు వారికి సౌకర్యంగా లేనటువంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారి తొలిదశలో మూడ్, వ్యక్తిత్వ మార్పులు కలుగుతుంటాయి. ఇలాంటివారు చిరాకు చీటికిమాటికి విసుక్కోవడం,మతిమరుపు తికమక పడటం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం వెతుక్కోవడం వాటి లక్షణాలు కూడా కనబడుతుంటాయి.
ఆటిజం: ఆటిజం కలవారు ఒక క్రమ పద్ధతిలో వారి పనులను చేస్తూ వెళ్తుంటారు. అయితే వీరు చేసే పనులలో ఏమాత్రం తారుమారైన అస్సలు సహించలేరు. అలాగే పెద్ద పెద్ద శబ్దాలకు తొందరగా అతిగా స్పందిస్తూ ఉంటారు. ఇక కొన్నిసార్లు తమని తాము గాయపరచుకుంటూ ఉంటారు.
నెలసరి సమస్యలు: మహిళలలో ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే వారిలో ఎక్కువగా ఈ కోపం చిరాకు వంటివి కనిపిస్తూ ఉంటాయి.నెలసరికి ఒకటి లేదా రెండు వారాల ముందు నుంచి మీరు అధికంగా కోపంగా కనిపిస్తున్నారు అంటేమీ సమస్య తీవ్రంగా ఉందని అర్థం అయితే కొందరు మహిళలలో నెలసరి ఆగిపోయే సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.
