మన శరీరం ధాతువుల సమ్మేళనం .. జీవక్రియలు సజావుగా సాగడానికి అనువుగా వివిధ ధాతువులు, ఖనిజ లవణాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపించినప్పుడు మన బాడీ కొన్ని సంకేతాలను ముందుగా పంపుతుంది. వాటిని పసిగట్టి జాగ్రత్తపడితే నిండు నూరేళ్లు హాయిగా బండి లాగించేయవచ్చు.

వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇక అంతే సంగతులు. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. దీని వల్ల రక్తహీనత వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ అదొక్కటే కాకుండా ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే మన శరీరంలో ఐరన్ లోపం ఉందని కనిపెట్డం ఎలా??

* ఐరన్ లోపం ఉన్న వారిలో ప్రధానంగా కనిపించే సమస్య త్వరగా అలసిపోవడం. చిన్న చిన్న పనులకే వీరు ఎక్కువగా అలసిపోతారు. దీనితో పాటు చికాకు, బలహీనంగా మారడం, పనిపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* నిద్రలో కాళ్లు అదే పనిగా కదుపుతండటం, మధ్య మధ్యలో గోకుతుండటం ఐరన్ లోపానికి సంకేతం

* రక్తహీనత వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.

* చర్మం పాలిపోతుంది. పెదవుల లోపలి భాగంలో చిగుళ్లు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది.

* తరచుగా నిద్రపోవాలని అనిపించడం, కారణం లేకుండానే చిరాకు పడటం

* చర్మ కాంతి తగ్గడం, నిర్జీవంగా మారడం, ముఖంపై పసుపుదనం రావడం

* తరచుగా తలనొప్పితో బాధపడుతుంటే కూడా ఐరన్ లోపం ఉందని అర్ధం

* చిన్న ఆందోళనకే గుండె వేగంగా కొట్టుకోవడం 

* గోళ్లు పెలుసుగా మారిపోవడం