Liver: శరీంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు సక్రమంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్నివిధాల ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అయితే కొన్ని అవయవాలకు రోగం వస్తే అది పూర్తిగా ముదిరాకనే బయటపడుతుంది. కొన్ని కొన్ని సార్లు కాలెయం ఆరోగ్యం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 

Liver: మానవ శరీరంలోని ముఖ్యమైన అవయాల్లో లివర్ ఒకటి. ఇది సక్రమంగా పనిచేసినప్పుడే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. మన శరీర అవయవాల్లో కాలెయం చేసే పని అంతా ఇంతా కాదు. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేందు కాలెయమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతేకాదు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని పోషకాలన్నింటిని గ్రహించి శరీర భాగాలను అందిస్తుంది. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే.. కాలెయం విషపదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లివర్ మన శరీరానికి చెక్ పోస్టు మాదిరి అన్నమాట. కానీ ప్రాణాంతకమైన పచ్చకామెర్లు, లివర్ క్యాన్సర్, ఫ్యాటీ లివర్ వంటి ఎన్నో రోగాలు కాలెయానికి వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోగాలను మొదటి దశలోనే గుర్తిస్తే మన ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదు కానీ.. వీటిని ప్రాథమిక దశలో గుర్తించకపోతే.. ప్రాణాంతకం కావొచ్చు. అయితే ఈ జబ్బులు కాలెయానికి సోకినప్పుడు మన పాదాలు, కాళ్లపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాదాలపై దోమలు కుడితే ఎలా అయితే ఎర్రగా మచ్చలు వస్తాయో.. అలాంటి పాదాలపై లేదా కాళ్లపై ఆ రకమైన మచ్చలు వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇలాంటి మచ్చలు లివర్ ఏదో ప్రమాదంలో ఉందని చెప్పే సంకేతాలు కాబట్టి. అయితే ఒక్కోసారి పాదాలకు బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా లేకపోయినా గోధుమ లేదా ఎరుపు రంగులోకి మారొచ్చు. అలా అని ఆ మచ్చలు దేనివల్ల వచ్చినయో మీరే నిర్దారించుకోకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. 

2. మోకాలి వెనక భాగం లేదా పాదాలపై రక్తనాళాలు ఎర్రగా చారలుగా కనిపిస్తే వాటిని అనుమానించాలి. అందులోనూ ఆ రక్తనాళాలు సాలెగూడు మాదిరి కనిపిస్తే.. మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే రక్తనాళాలు అలా కనిపిస్తే ఫ్యాటీ లివర్ లేదా లివర్ సిర్రోసిన్ అనే జబ్బు మీ కాలెయానికి సోకిందని అర్థం.

3. ఊరికే పాదాల్లో వాపు రావడం, నీరు పట్టి లావుగా మారితే కూడా కాలెయానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టే. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించిన దేని కారణంగా అలా జరిగిందో తెలుసుకోవాలి.

4. కారణం లేకుండానే అరికాళ్లలో నొప్పిగా నిపించడం, దురద పెట్టడం వంటి సమస్యలను తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇలాంటి సమస్యలు కాలెయం ప్రమాదంలో ఉన్నప్పుడే జరుగుతాయి. కాబట్టి ఈ సమస్యలు ఎక్కువకాలం నుంచి మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి.. కాలెయ పరీక్షలు చేయించుకోండి.

5. పాదాల నుంచి దుర్వాసన రావడం, పాదాలపై ఫంగస్ చేరడం, కాళ్ల వేళ్ల మధ్యన ఇన్ఫెక్షన్ వస్తే కూడా అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు కాలెయ సమస్యలు వచ్చినప్పుడు కూడా వస్తూ ఉంటాయి. 

6. కాళి కోర్లు తెల్లగా మారితే కూడా జాగ్రత్త పడాలి. అయితే కాళి గోర్లు తెల్లగా మారడానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. అయితే మీ కాళి గోర్లు జింక్ లోపంతో కాకుండా అలా మరీ తెల్లగా మారితే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే అది లివర్ సమస్య వల్లే వచ్చుండొచ్చు కాబట్టి.

పై లక్షణాలు మీలో కనిపిస్తే.. ఆ తర్వాత చూపించుకుందాంలే అని వదిలేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి మీ అనుమానాలను తీర్చుకోండి. ఒక వేళ లివర్ సమస్య వల్లే అవి వస్తే రోగం ముదిరి ప్రాణాల మీదికొచ్చే ప్రమాదం ఉంది.