Asianet News TeluguAsianet News Telugu

చక్కెరలో యూరియాను కలుపుతున్నారు.. కూరగాయలను కల్తీ చేస్తున్నారు. వాటిని ఇలా గుర్తించండి..

Adulteration testing: మార్కెట్ లో కొనుగోలు చేసిన ఏ వస్తువు అసలుదో.. ఏది కల్తీదో తేల్చుకోవడం కష్టమైనది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువుల్లో చాలా వరకు కల్తీవే కాబట్టి. పప్పులు, నూనెలు, కూరగాయలు, చక్కెర వంటి ఎన్నో పదార్థాలు పూర్తిగా కల్తీగా మారిపోతున్నాయి. మరి వీటిని కొన్నప్పుడు అవి కల్తీవో కావో ఈ చిట్కాల ద్వారా గుర్తించండి..

Identify vegetable adulteration
Author
Hyderabad, First Published Jan 15, 2022, 2:23 PM IST

Adulteration testing: మనం మంచివనుకుంటున్న ఎన్నో వస్తువులు కల్తీకి గురవుతున్నాయి. కళ్లతో చూసి వాటిని గుర్తించడం చాలా కష్టమే. అందుకే కల్తీ పదార్థాలను కూడా వాడేస్తూ మనకు తెలియకుండానే అనేక రోగాల బారిన పడుతున్నామన్న సంగతి మీకు తెలుసా. మన అవసరాలే కొందరికి లాభాల వ్యాపారంగా మారింది. అందుకే మనం నిత్యవసారిని ఉపయోగించే ఎన్నో వస్తువులను కల్తీ చేసేస్తూ దొంగ వ్యాపారలను యథేచ్చగా నిర్వహిస్తున్నారు. ఎంతో మందిని హాస్పటల్ల పాలు చేస్తున్నారు. 

పాలు, నీళ్లు, వంట నూనెలు, మసాలాలు, కారం పొడి, నెయ్యి, చక్కెర, కూరగాయలు అంటూ ఎన్నింటినో కల్తీ ని చేస్తున్నారు. ఇందులో కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు  Chemicalsను కలుపుతున్నారు. ఒక్కో సారి మన కళ్లు కూడా మోసపోవచ్చు. మనం కొన్నవన్నీ మన కళ్లకు బాగానే కనిపిస్తాయి.. కానీ వాటిలో ఎన్నో రకాల ప్రమాదకరమై  Chemicals ను వాడి ఉండొచ్చు. మరి వాటిని ఎలా కనిపెట్టాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. అసలువి ఏవే.. కల్తీ ఫుడ్ ఏదో తెలుసుకునేందుకు భారత ఆహార పరిరక్షణ, నాణ్యతా ప్రమాణాల సంస్థ కొన్ని చిట్కాలను, సూచనలను తరచుగా వెళ్లడిస్తూ ఉంటుంది. దీని ద్వారా మనం కొనుగోలు చేసే పదార్థాలు కల్తీవా..? లేకపోతే మంచివా..? అనేవి సులభంగా తెలుసుకోవచ్చు. 

కూరగాయల్లో బట్టలకు రంగులు అద్దేందుకు use చేసే ప్రమాదకరమై మలకైట్ గ్రీన్ రసాయనాన్ని ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కూరగాయలకు ఉపయోగించడం వల్ల వెజిటేబుల్స్ ఫ్రెష్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన మలకైట్ గ్రీన్ ను ఎక్కువగా బఠానీలు, బచ్చలి కూర, మిరపకాయలకు ఉపయోగిస్తున్నారని ఆరోగ్య నిపుణులు వెళ్లడిస్తున్నారు.  ఈ మలకైట్ గ్రీన్ ఉష్ణోగ్రత, సమయాలను బట్టి మనకు ప్రమాదకరంగా మారుతుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ ఫర్మేషన్ వెళ్లడిస్తోంది. ఇది ఉపయోగించిన ఆహార పదార్థాలను తినడం వల్ల శ్వాస కోస సంబంధ అనేక సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అలాగే గర్భిణులు వీటిని తింటే పిండం సరిగ్గా పెరగదు. అలాగే క్రోమోజోములు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఎస్ఎస్ఏఐ ట్విట్టర్ వేదికగా ప్రజలకు అవగాహన కల్పించడానికి సూచనలు చేసింది.  

వంట నూనె కల్తీ కాలేదని నిర్దారించుకోవాలంటే ఇలా చేయండి.. మిల్లీ లీటర్ నూనెనుు ఒక టెస్ట్ ట్యూబ్  లో పోయండి. దానిలో నాలుగు మిల్లీ లీటర్ల డిస్టిల్డ్ వాటర్ ను వేసి.. రెండు బాగా మిక్స్ అయ్యేలా షేక్ చేయండి. ఆ తర్వాత మరొక టెస్ట్ ట్యూబ్ తీసుకుని అందులో రెండు మిల్లీ లీటర్ల ఇందాక కలిపిన ద్రావనాన్ని పోయండి. ఇక  అందులో రెండు మిల్లీ లీటర్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి షేక్ చేయండి. ఆ టెస్ట్ ట్యూబ్ పై భాగంలో రెడ్ కలర్ లో  పై పొర ఏర్పడినట్టైతే అది కల్తీ అయినట్టేనని అర్తం చేసుకోవాలి.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios