ఈ చిట్కాలు పాటిస్తే.. డెంగ్యూ మీ వైపు కన్నెత్తి కూడా చూడదు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 30, Jul 2018, 3:44 PM IST
home remedies of dengue
Highlights

వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోతుంది.. రోజుల తరబడి అలా నీరు నిల్వ  ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులను వ్యాపింపజేస్తాయి. వాటిలో ప్రధానమైనది డెంగ్యూ

వర్షాకాలం తనతో పాటు అనేక వ్యాధులను వెంటబెట్టుకొస్తుంది. లేత చిగురులు వచ్చే కాలం కాబట్టి.. అనేక క్రిమికీటకాలు పొదలు, మొక్కలు, చెట్లకు వ్యాపించి తమ సంతానాన్ని పెంచుకుంటూ వుంటాయి. వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోతుంది.. రోజుల తరబడి అలా నీరు నిల్వ  ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులను వ్యాపింపజేస్తాయి. వాటిలో ప్రధానమైనది డెంగ్యూ.

సకాలంలో ఈ వ్యాధిని గుర్తిస్తే చికిత్సతో బయటపడవచ్చు.. లేని పక్షంలో రోజుల వ్యవధిలోనే ప్రాణాలు పోయేంత ప్రాణాంతకమైనది డెంగ్యూ. మనిషిని చావు వరకు తీసుకెళ్లే ఈ వ్యాధి రాకుండా మన పెరట్లో, వంటింట్లో దొరికే పదార్థాల సాయంతో అడ్డుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

* పసుపు ఒక సహజసిద్ధమైన యాంటి అక్సిడెంట్.. దీని గొప్పదనం తెలుసుకున్న మన పూర్వీకులు.. పసుపుని వంటలో తప్పనిసరి చేశారు. వర్షాకాలంలో పసుపు మోతాదుని పెంచాలట.

* వేపాకులని నీటిలో మరిగించి.. ఆ నీటిని పొద్దున్న ఓసారి.. సాయంత్రం ఓసారి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* రక్తంలోని ప్లెట్లెట్స్‌పై డెంగ్యూ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని సంఖ్యను అదుపులో ఉంచుకోవాలి... అలాగే ఒంటికి యాంటిఆక్సిడెంట్స్‌ అందిస్తూ ఉండాలి.. అప్పుడే డెంగ్యూ ప్రమాదం తగ్గుతుంది.. ఇవన్నీ దానిమ్మలో సమృద్ధిగా దొరుకుతాయి.

* సి విటమిన్ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది.. అందువల్ల నిమ్మ, నారింజ, బత్తాయి వంటి నిమ్మ జాతి పండ్లను విరివిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

* బొప్పాయి ఆకులు డెంగ్యూ మీద బాగా పనిచేస్తాయట.. బొప్పాయి రసం, బొప్పాయి ముక్కలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

* రోజుకు రెండు జామ పండ్లు తీసుకోవడం వల్ల ఫైబర్‌తో పాటు విటమిన్ సి అధికంగా దొరుకుతుంది.

* మీ ఇంటి సమీపంలో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.. పూలకుండీలు, ఎయిర్‌కూలర్‌లోని పాత నీటిని తొలగించాలి..

* వాటర్ ట్యాంకులపై పై కప్పులు బిగుతుగా బిగించాలి.

* ఇంటి సమీపంలో పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్తపడాలి.

loader