Holi 2023: ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు పచ్చ అంటూ తీరొక్క రంగులను హోలీకి ఉపయోగిస్తాం. హోలీకి రంగులను ఉపయోగించడం సరే.. మరి ఏ రంగు ఏ అర్థాన్ని ఇస్తుందో తెలుసా? 

హోలీని రంగుల పండుగ అని కూడా పిలుస్తారు. స్నేహితులు, ఫ్యామిలీ అంతా కలిసి రంగులను పూసుకుంటూ రంగు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. మీకు తెలుసా ఒకప్పుడు హోలీకి ఒకే రంగును ఉపయోగించేవారు. అదే ఎరుపు రంగును. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క కలర్ ను హోలీకి ఉపయోగిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, ఆనందం అంటూ ప్రతి భావాన్ని తెలియజేయడానికి శక్తివంతమైన రంగులను ఉపయోగిస్తున్నారు. హోలీలో ఎక్కువగా ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, నారింజ, కుంకుమ, ఊదా రంగును ఉపయోగిస్తారు. మరి ఏ రంగు ఏ అర్థాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎరుపురంగు

ఎరుపు రంగుకు భారతదేశంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రంగు ప్రేమ, అభిరుచిని తెలియజేస్తుంది. ఈ రంగు స్వచ్ఛత, సంతానోత్పత్తి, ప్రేమ సౌందర్యానికి ప్రతీకగా మహిళలు ఎరుపు రంగును ఉపయోగిస్తారు. ఎరుపు అంటే మహిళలకు వివాహానికి సంకేతంగా వాడుతారు. వివాహం చేసుకున్న ప్రతి మహిళా నుదిటిపై ఎర్రని కుంకుమను పెట్టుకుంటుంది. హోలీ సందర్భంగా ఈ ఎరుపు రంగు అభిరుచి, బలం, సంపద మొదలైన అర్థాలను ఇస్తుంది. ఈ ఎరుపు రంగును ప్రియమైన వారికి పూస్తారు. దానధర్మాలు, ధైర్యవంతులు, రక్షకులు, చెడును నాశనం చేసే సామర్థ్యం ఉన్నవారు ఎప్పుడూ ఎరుపు రంగు దుస్తులనే వేసుకుంటారు. 

పసుపు రంగు

పసుపు భారతదేశపు పవిత్ర రంగు. దీనికి వైద్యం చేసే సామర్థ్యాలు ఉన్నాయని నమ్ముతారు. విష్ణువు, శ్రీకృష్ణుడు, వినాయకుడితో పాటుగా ఎంతో మంది దేవతలకు పసుపు రంగు దుస్తులు ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. పసుపును భారతదేశంలో శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పసుపును శుభ కార్యాలయాలకు కూడా ఉపయోగిస్తారు. 

నీలం

నీలం రంగు ఆకాశం, సముద్ర రంగు, ప్రశాంతత సంకేతం. భారతదేశంలో అత్యంత ఇష్టమైన దేవుళ్ళలో ఒకరైన శ్రీకృష్ణుడి శరీర రంగు కూడా నీలమే. భారతీయ సంస్కృతిలో అమరత్వం, ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం అని అర్థాలను కూడా ఇస్తుంది. 

ఆకుపచ్చ

ఆకుపచ్చ రంగు ప్రకృతికి ప్రతీక. ఇది కొత్త ప్రారంభానికి, పంట, సంతోషానికి ప్రతీక. భారతదేశ జనాభాలో 14.9% ఉన్న రెండవ అతిపెద్ద మతమైన ఇస్లాంలో ఇది ఒక పవిత్ర రంగు.

గులాబీ రంగు

గులాబీ రంగు యవ్వనం, మంచి ఆరోగ్యం, ఉల్లాసాన్ని సూచిస్తుంది. ఇది హోలీ వేడుకలకు మరింత ఆనందాన్ని, వినోదాన్ని, శక్తిని తెస్తుందని నమ్ముతారు. పింక్ కలర్ అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన రంగు. 

నారింజ

ఆరెంజ్ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పవిత్ర రంగు. యోగులు, గురువులు, దేవుని మనుషులు తలపాగాలతో కూడిన కాషాయ రంగు వస్త్రాలను ధరిస్తారు. హిందూ మతంలో నారింజ శక్తి కేంద్రాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఇది లైంగిక / స్వీయ కేంద్రం కూడా. భారత పతాకంలో నారింజ అంటే భారతీయ ప్రజల బలం, ధైర్యం అని అర్థం.

ఊదారంగు

పర్పుల్ నీలం ప్రశాంతమైన రంగు. ఇది అభిరుచిని మిళితం చేస్తుంది. ఇది రాయల్టీ, సంపద, అధికారంతో ముడిపడి ఉంటుంది. హిందూ మతంలో.. విశ్వానికి వారధి.

హోలీకి ఉపయోగించకూడని రంగులు

హోలీకి తెలుపు, నలుపును ఉపయోగించరు.

తెలుపును ప్రధానంగా కుటుంబంలో మరణాన్ని సూచించే అంత్యక్రియలకు, వేడుకలకు ఉపయోగిస్తారు. వితంతువులు తెల్లరంగు దుస్తులను ధరిస్తారు.