Telugu

గులాబీలు గుత్తులుగా పూయాలంటే ఈ ఎరువును వాడండి

Telugu

చలికాలంలో గులాబీపువ్వులు

చలికాలంలో గులాబీ పువ్వులు విరగకాస్తాయి.  ఇంట్లో గులాబీ మొక్క ఉన్నా పూలు పూయకపోతే కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించండి.

Image credits: Storyblocks
Telugu

గులాబీ మొక్కల సంరక్షణ ఎలా?

మీ ఇంట్లో పాత గులాబీ మొక్క ఉంటే వెంటనే మట్టిని మార్చండి. మట్టిని మార్చేటప్పుడు వేప ఆకులను కూడా వేసి బాగా కలపండి.  ఇది కీటకనాశినిగా పనిచేస్తుంది.

Image credits: Storyblocks
Telugu

ఆవు పేడతో

గులాబీ మొక్కలకు ఆవు పేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆ మొక్కకు ఆకులు తక్కువగా ఉంటే నీరు చాలా తక్కువగా ఇవ్వాలి.  ఆకులు ఉంటే వారానికి 2 సార్లు నీరు ఇవ్వొచ్చు. 

Image credits: Storyblocks
Telugu

ప్రత్యేకమైన ఎరువు ఇదే

గులాబీ మొక్కకు ఎరువు అవసరం. ఒక కేజీ ఆవు పేడ, వర్మి కంపోస్ట్, 1/3 టేబుల్ స్పూన్ బయోజీ, సీ వీడ్ ఎక్స్‌ట్రాక్ట్ గ్రాన్యూల్స్ కలిపి ఎరువు తయారు చేసుకోండి.  దీన్ని అప్పుడప్పుడు వాడండి.

Image credits: Storyblocks
Telugu

ఫంగస్ రాకుండా

గులాబీ మొక్కల ఆకులకు  ఫంగస్ పడుతుంది. అటువంటప్పుడు ఒక లీటరు నీటిలో ఫంగిసైడ్ పౌడర్ కలిపి ఆకులపై స్ప్రే చేయండి.  

Image credits: Storyblocks
Telugu

ఎక్కువ పూలు ఎలా?

గులాబీ మొక్కలకు ఆకులు లేకపోతే పోషకాల లోపం కారణం. రెండు చెంచాల మెగ్నీషియం సల్ఫేట్‌ను మట్టి అంచులలో వేసి కప్పండి. ఇలా చేయడం వల్ల కొత్త ఆకులు, పూలు వస్తాయి.

Image credits: Storyblocks
Telugu

ఎప్పుడు నీరు పోయాలి?

గులాబీ మొక్కలకు ఎండ, నీరు చాలా ముఖ్యం. చలికాలంలో వారానికి ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. మట్టి తడిగా లేదా తేమగా ఉంటే 15 రోజులకు ఒకసారి మాత్రమే నీరు పోయాలి. 

Image credits: Storyblocks

ఇవి రాస్తే.. తలలో చుండ్రు మాయం

కుబేర మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా?

5 గ్రాముల్లో బంగారు బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో

బరువు తగ్గాలి అనుకునేవారు ఏ రైస్ తినాలి?