ప్రపంచంలో కెల్లా ఖరీదైన పాలు ఏ జంతువువో తెలుసా?

 ఈ ఎలుక పాలకు ఇంత ఖరీదు ఎందుకో తెలుసా? ఎలుక పాలు సంపాదించడం అంత సులువు కాదట. 

Highest Price of rat Milk ram

మనమందరం రోజూ వారీ ఆవు పాలు, గేదె పాలు తీసుకుంటూ ఉంటాం. పాలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటుంది. అయితే, ఇవి మాత్రమే కాదు, చాలా జంతువులు పాలు ఇస్తాయి. ఇప్పటి వరకు మనం గాడిద పాలు చాలా ఖరీదైనవిగా భావిస్తూ వచ్చాం. కానీ,  దానికన్నా ఖరీదైన పాలు ఉన్నాయి. అవి ఎలుక పాలు అంటే మీరు నమ్మగలరా? మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఎలుక పాలు ధర రూ. లక్షలు పలుకుతోంది. 

అసలు, ఈ ఎలుక పాలకు ఇంత ఖరీదు ఎందుకో తెలుసా? ఎలుక పాలు సంపాదించడం అంత సులువు కాదట. పాలు తీయడానికి 30 నిమిషాలే పడుతుందట. కానీ,  ఎలుక నుంచి చాల కొద్ది పాలు మాత్రమే వస్తాయి. ఒక లీటర్ పాలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 40వేల ఎలుకలు అవసరమౌతాయి.  అందుకే, ఎలుకల నుంచి సేకరించిన ఒక లీటరు పాల ధర రూ.18లక్షలు పలుకుతోంది.

ఇక, ఎలుక పాలను పరిశోధనల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మలేరియా బ్యాక్టీరియా ను చంపే మందుల తయారీలో ఈ ఎలుక పాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే, ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏ కంటే ప్రభావంతంగా ఉంటుంది. పైగా మానవ శరీరానికి సంబంధించింది. అందువల్ల ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడం చాలా సులభం. ప్రయోగాలకు వేల జంతువులు అవసరమౌతాయి. అదే ఆవు అయితే, ఆవు పాలను  వినియోగించడం సాధ్యం కాదట.  అందుకే, దాని కంటే ఎలుకలను వినియోగిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios