ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సు వారు కూడా గుండెపోటు (heart attack)కు గురవుతున్నారు. అయితే గుండెపోటు రాకముందే మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని తెలుసుకుంటే.. ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు.
ప్రస్తుత కాలంలో గుండెపోటు (heart attack), గుండె జబ్బులు (Heart disease) ఎక్కువ అవుతున్నాయి. చిన్న వయసు వారు సైతం ఈ రోగాల బారిన పడుతున్నారు. అందులో ఆకస్మిక గుండెపోటు (Sudden heart attack) ప్రాణాలను తీసేసేదిగా తయారైంది. చాలా సందర్భాల్లో.. Clogged arteries వల్ల కూడా గుండెపోటు వస్తుంది. ధమనులలో సాధారణంగా కొవ్వు (Fat), కొలెస్ట్రాల్ (Cholesterol) మరియు ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల ధమనుల్లో అడ్డంకి ఏర్పడుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని నెమ్మదింపజేస్తుంది. దీంతో గుండె కండరాల యొక్క ఒక భాగం తగినంతగా రక్తాన్ని పొందలేనప్పుడు గుండెపోటు సంభవిస్తుంది.
సైలెంట్ హార్ట్ ఎటాక్ ను సైలెంట్ కిల్లర్ (Silent killer) అని అంటారు. నిశ్శబ్ద గుండెపోటు (Silent Heart Attack) సంభవించకముందే శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది తెలుసుకుంటే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగదు. ముఖం (Face), తల (Head)మరియు చెవుల్లో ( ears) వచ్చే మార్పులను గమనించడం ద్వారా గుండెపోటు లక్షణాలను గుర్తించవచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటు లక్షణాలు (Symptoms of heart attack): ఛాతిలో నొప్పి, బలహీనమైన భావన, దవడ (Jaw) మరియు మెడ (Neck)లో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు. వీటితో పాటు గుండెపోటుకు సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా ముఖంపై కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సకాలంలో చికిత్స పొందడం ద్వారా ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. అవేంటంటే..
కనురెప్పల చుట్టూ కొలెస్ట్రాల్ నిల్వలు: కొలెస్ట్రాల్ కనురెప్పల చుట్టూ పసుపు పచ్చగా మారడానికి కారణమవుతుంది. దీనినే క్సాంథెలాస్మా (Xanthelasma)అంటారు. ఇది రక్తంలో అసాధారణ లిపిడ్ స్థాయిలకు సంబంధించినది. దీన్నే డిస్లిపిడెమియా (Dyslipidemia) అంటారు. డైస్లిపిడెమియా ధమనుల గోడలపై కొలెస్ట్రాల్ ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె, మెదడు మరియు శరీరంలోని ఇతర ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ మరియు Peripheral arterial disease ప్రమాదాన్ని పెంచుతుంది.
ముఖ్యంగా అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఉన్నవారిలో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. బట్టతల గుండె జబ్బులకు ప్రమాదకరమైన సంకేతం. బట్టతల ఉన్న పురుషులను అధిక కొలెస్ట్రాల్ ఉన్న పురుషులతో పోలిస్తే గుండె జబ్బుల ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. జుట్టు రాలడం, గుండె జబ్బుల మధ్య జీవ సంబంధం పురుష హార్మోన్ల యొక్క అధిక స్థాయిలను కలిగి ఉంటుంది.
340 మంది రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. చెవి మడతలు, వృద్ధాప్యం మరియు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD) తో సంబంధం ఉన్న సంకేతం. లక్షణాలు ఉన్నవారిలో చెవి మడతలు కనిపిస్తాయి. ఒక నివేదిక పురుషులు, మహిళల్లో Earlobe creases కు, హృదయ సంబంధ వ్యాధుల మధ్య బలమైన సంబంధాన్ని కనుగొంది.
గుండెపోటు సంభవించిన వెంటనే ముందుగా వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలి. ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లేకపోతే వ్యక్తి బతికే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ప్రాసెస్ చేయబడిన, జంక్ ఫుడ్ తీసుకోవడం, చెడు జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం మొదలైన అనేక కారకాల వల్ల గుండెపోటు రావచ్చు.
