Hug Day: కౌగిలించుకోవడం అనేది ఒక వెచ్చదనం. ఒక్కసారి ఇష్టమైన వాళ్లను కౌగిలించుకోవడం వల్ల బాధలను మర్చిపోయి ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. ఈ కౌగిలింత అనేది ఒక ప్రేమకు చిహ్నం అని చెప్పాలి. ఒకరిపై ఇష్టం ఉంటే ఆ ఇష్టాన్ని కౌగిలింత ద్వారా చూపించవచ్చు. ఇక అటువంటి కౌగిలింతనే ప్రేమికుల వారోత్సవంలో ప్రత్యేకమైన రోజుగా చేసుకుంటారు.
ఫిబ్రవరి నెలలో ఏడవ తేదీ నుంచి ప్రేమికుల రోజు ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుంచి 14 వరకు ప్రతిరోజు ప్రేమికులు రోజ్ డే, ప్రపోస్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే అని ప్రతిరోజు జరుపుకుంటారు. అయితే ఆ వారంలో హగ్ డే అనేది కూడా ప్రత్యేకమైన రోజు. ఒకరిపై ఒకరు ప్రేమను తెలిపేందుకు హగ్ డే బాగా ఉపయోగపడుతుంది.
కేవలం ప్రేమికులే కాకుండా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు అలా ఎవరైనా సరే కనిపించిన వెంటనే ఒక్కసారి ప్రేమతో కౌగిలించుకుంటే ఆ సమయంలో ఎన్నో బాధలు దూరమయ్యాయి అన్నట్లుగా ఉంటాయి. అంతేకాకుండా కౌగిలించుకోవడం వల్ల మేము మీకు ఎప్పుడు తోడుగానే ఉంటాము అని అర్థం చెప్పినట్లుగా ఉంటుంది.
ఇక ప్రేమికుల మధ్య కూడా అదే కౌగిలింత రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు అలిగిన బుజ్జగించేందుకు హగ్ చేసుకోవటం, వాళ్ళల్లో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేయడానికి కూడా హగ్ చేసుకోవడం, వారు బాధపడుతున్న కూడా ఆ బాధను దూరం చేసుకోవడం కోసం హగ్ చేసుకోవడం, సంతోషంలో ఉన్న కూడా ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం హగ్ చేసుకోవడం.. ఇలా ప్రేమికుల మధ్య రకరకాలుగా కారణాలకు కౌగిలింత అనేది మొదటిగా ఉంటుంది.
అయితే ఈ ప్రేమికుల వారోత్సవం సందర్భంగా.. రెండు జంటల మధ్య ఉన్న ప్రేమ మరింత దృఢంగా మారుస్తుంది హగ్ డే. అయితే ప్రేమికులు ఈ రోజున ప్రత్యేకంగా కలిసి అన్ని బాధలు మర్చిపోయి ఒకేసారి తము ప్రేమించిన వ్యక్తిని గట్టిగా హగ్ చేసుకుని సంతోషాన్ని పంచుకుంటారు. నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అన్నట్లుగా ఆ కౌగిలింత ద్వారా చెబుతారు.
దూరంగా ఉన్నవాళ్లు మాత్రం ఈ కౌగిలింతను మిస్ అవుతూ ఉంటారు. వారికి దగ్గరికి వచ్చి కౌగిలించుకునే అంత సమయం, సందర్భం లేనప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ మాటలతో కౌగిలింతలో మునిగేలా చేయవచ్చు. ఇక అలాంటివారు మంచి మంచి కొటేషన్స్ తో ఈ విధంగా విషెస్ చేయటం వల్ల మీరు ప్రేమించిన వ్యక్తులను నేరుగా హగ్ చేసుకునే ఫీల్ లో కలిగించవచ్చు.
నీకు దూరంగా ఉన్నా కూడా.. నీ కౌగిలింతలో నేను ఉన్నాను.. ఒక్కసారి నన్ను ఊహించుకొని కౌగిలించుకో.. నా స్పర్శ నీకు తాకును. హ్యాపీ హగ్ డే..
ప్రతి విషయంలోనా చెయ్యి పట్టుకొని దగ్గరున్నావు.. నా జీవితంలో కూడా నా కౌగిలింతలో దగ్గరుండేలా కోరుకుంటున్నాను.. హ్యాపీ హగ్ డే..
కౌగిలింత అనేది రెండు మనసులు దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు.. దూరంగా ఉన్నా కూడా నా మనసు నీ మనసును కౌగిలించుకుంది. హ్యాపీ హగ్ డే..
నువ్వు దూరంగా ఉన్నా కూడా నువ్వు కౌగిలించుకున్న జ్ఞాపకాలు ఇప్పటికీ నా వెంటే ఉన్నాయి. హ్యాపీ హగ్ డే..
