Asianet News TeluguAsianet News Telugu

చాక్లెట్ డే: తీయని వేడుక కోసం మీరే చాక్లెట్లను చేద్దామనుకుంటున్నారా? ఇదిగో నోరూరించే ఈ వంటకాలను ట్రై చేయండి

Chocolate Day 2023: ఏదేమైనా మనకు ఇష్టమైన వాళ్లు మనకోసం స్వయంగా వంటకాలను తయారుచేస్తే మనం ఎంతగా సంతోషిస్తామో.. వాళ్లకోసం మనం అలాగే చేస్తే కూడా వారు మనకంటే ఇంకా ఎక్కువ సంతోషిస్తారు. అందుకే ఈ చాక్లెట్ డేకి మీ ప్రియమైన వారికోసం మీరే కొన్ని చాక్లెట్ వంటకాలను తయారుచేసి వారిని సర్ ప్రైజ్ చేయండి. 
 

Happy Chocolate Day 2023: Recipes you can try at home to make chocolates for your loved ones
Author
First Published Feb 9, 2023, 11:49 AM IST

Chocolate Day 2023: ఒక్క ప్రేమికులు మాత్రమే ఈ వాలెంటైన్స్ వీక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. భార్యాభర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా వాలెంటైన్స్ ను సెలబ్రేల్ చేసుకోవచ్చు. ప్రేమ, స్నేహం, ఆప్యాయతలను పంచుకోవడానికే ఈ వాలెంటైన్స్ వీక్ ను జరుపుకుంటారు. రోజ్ డే నుంచి వాలెంటైన్స్ డే వరకు.. వారంలోని ప్రతి రోజు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.ఇక ఈ రోజు చాక్లెట్ డే. ఇది వాలెంటైన్స్ వీక్ వేడుకలలో ఒక భాగం. దీనిని ప్రతి ఏడాది ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. ఇక ఈ రోజున ప్రజలంతా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు,  ప్రియమైనవారి పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రశంసలకు చిహ్నంగా చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇందుకోసం బయట దొరికే చాక్లెట్లను ఇస్తుంటారు. కానీ మీకు ఇష్టమైన వారి కోసం మీరే స్వయంగా తయారుచేయడంలో వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీనిని తీసుకున్న వాళ్లు కూడా ఎంతగానో సంతోషిస్తారు. అందుకోసమే.. వారికోసం ఎలాంటి చాక్లెట్ వంటకాలను తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

డార్క్ చాక్లెట్ ట్రఫుల్

కావలసిన పదార్థాలు: 200 గ్రా డార్క్ చాక్లెట్, 120 గ్రా హెవీ క్రీమ్, 10 మి.లీ రమ్, 5 గ్రాముల బటర్ కోకో పౌడర్,

తయారీవిధానం:  ముందుగా డార్క్ చాక్లెట్‌ను తీసుకుని కరిగించండి.  అలాగే క్రీమ్‌ను సన్నని మంటమీద వేడి చేయండి. కానీ అది ఉడకకుండా చూసుకోండి. దీనిలో  కరిగించిన డార్క్ చాక్లెట్లను వేసి బాగా కలిపి కిందికి దించుకోండి. ఈ పదార్థం చల్లబడిన తర్వాత.. దానిలో వెన్న, రమ్‌ ను వేసి కలపండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిపై పార్చ్‌మెంట్ పేపర్‌ వేసి ఆ పదార్థాన్ని పోయండి. దీనిలోంచి 20 గ్రా తీసుకొని చేతితో లడ్డూల్లా చుట్టండి. వీటిని 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి.  వీటిని మళ్లీ ఒకసారి సెట్ చేసి వాటిని కోకో పౌడర్‌లో ముంచి వెంటనే సర్వ్ చేయండి.

డార్క్ చాక్లెట్ బ్రెడ్

కావలసిన పదార్థాలు: 120 గ్రా డార్క్ చాక్లెట్, 185 గ్రా పిండి,  5 గ్రా బేకింగ్ పౌడర్, 2 గ్రా బేకింగ్ సోడా, 1 గ్రా ఉప్పు, 200 గ్రా ఉప్పు లేని వెన్న,  225 గ్రా బ్రౌన్ షుగర్, 5 మి.లీ వెనిలా ఎసెన్స్, 2 గుడ్లు, 5 గ్రా తరిగిన వాల్‌నట్‌లు, 20 గ్రా డార్క్ చాక్లెట్ క్యాలెట్లు 

తయారీవిధానం: ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కి వేడి చేసి, 9 రొట్టె టిన్‌లను తయారుచేయండి. మైక్రోవేవ్-సేఫ్ గిన్నెను తీసుకుని అందులో 120 గ్రా డార్క్ చాక్లెట్ కరిగించండి. ఆ తర్వాత దీన్ని తీసి పక్కనపెట్టుకోండి. ఆ తర్వాత పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పును జల్లెడ పట్టి  పక్కన పెట్టుకోండి.  ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో వెన్న, బ్రౌన్ షుగర్ కలిపి మెత్తగా అయ్యే వరకు కలపండి. దీనిలో వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. వెన్న-బ్రౌన్ షుగర్ మిశ్రమంలో కరిగించిన చాక్లెట్‌ను వేయండి. అలాగే కొట్టిన గుడ్లు వేసి బాగా కలపండి. అలాగే దీనిలో పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా,  ఉప్పును వేసి బాగా కలపండి. అలాగే తరిగిన వాల్‌నట్స్ ను వేయండి. సిద్ధం చేసుకున్న లూఫ్ టిన్‌లో.. ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో  సుమారు 25 నుంచి 30 నిమిషాలు కాల్చండి. కేక్ దట్టంగా, తేమగా ఉండేలా చూసుకోండి. దీన్ని అలాగే లేదా వనిల్లా బీన్ ఐస్ క్రీంతో సర్వ్ చేయండి.

డార్క్ చాక్లెట్ స్ట్రాబెర్రీలు

కావలసిన పదార్థాలు: 6 ఔన్సుల డార్క్ చాక్లెట్, 6 ఔన్సుల వైట్ చాక్లెట్ 18 నార్మల్ సైజ్ స్ట్రాబెర్రీలు.

తయారీపద్ధతి: ముందుగా డార్క్ చాక్లెట్‌ను ముక్కలుగా చేసి గాజు గిన్నెలో వేయండి. ఆ తర్వాత మైక్రోవేవ్‌లో కరిగించండి. వైట్ చాక్లెట్‌ ను కూడా ఇలాగే కరగబెట్టండి.  దీంతో మీకు 2 బౌల్స్ మృదువైన, కరిగించిన చాక్లెట్ ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాబెర్రీలను తీసుకుని కొన్ని డార్క్ చాక్లెట్ లో, ఇంకొన్ని భాగాన్ని వైట్ చాక్లెట్లలో ముంచి ఒక ప్లేట్ లో పెట్టండి. అయితే చాక్లెట్ గట్టిపడుతున్నప్పుడు డార్క్ చాక్లెట్ స్ట్రాబెర్రీలపై తెల్లటి చాక్లెట్ ను చినుకుల్లా వేయండి. ఇందుకోసం చెంచా లేదా, బాటిన్ ను ఉపయోగించండి.

Follow Us:
Download App:
  • android
  • ios