Asianet News TeluguAsianet News Telugu

చలికాలంలో జుట్టు పొడిపారకుండా ఉండాలంటే...

చలికాలంలో.. తేమ తక్కువగా ఉంటుంది. దీంతో తల పొడిబారి దురద పెడుతుంది. దాని కారణంగా చుండ్రు సమస్య వచ్చి పడుతుంది. కాబట్టి.. ఈ కాలంలో వారానికి ఒకసారైనా తలకు నూనె రాయాలి. 

hair problem sollutions in winter season
Author
Hyderabad, First Published Dec 17, 2018, 4:33 PM IST

చలికాలం వచ్చిందంటే చాలు.. జుట్టు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా పొడిబారిపోయి.. నిర్జీవంగా తయారౌతాయి. జుట్టులో తేమ అన్నది లేక.. కళలేకుండా తయారౌతుంది. ఎంత ఖరీదైన షాంపూ వాడినా.. పరిస్థితిలో మార్పు మాత్రం ఉండదు. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా.. అంటే.. కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా...

చలికాలంలో.. తేమ తక్కువగా ఉంటుంది. దీంతో తల పొడిబారి దురద పెడుతుంది. దాని కారణంగా చుండ్రు సమస్య వచ్చి పడుతుంది. కాబట్టి.. ఈ కాలంలో వారానికి ఒకసారైనా తలకు నూనె రాయాలి. కొబ్బరినూనెలో కొద్ది నిమ్మరసం కలిపి.. వేడి చేసుకొని తర్వాత దానిని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

మరో సమస్య.. జట్టు ఎండుగడ్డిలాగా మారడం.  అలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తలంతా రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు నిగనిగలాడుతుంది.

తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడటం మర్చిపోవద్దు.. కండిషనర్ వాడటం కారణంగా జట్టు పొడిబారే సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా అరటిపండు గుజ్జులో ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా పట్టుకుచ్చులా మెరుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios