MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది

Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది

Real Love story: ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ప్రేమ సంఘటనను మనతో పంచుకున్నారు. ప్రేమంటే స్వచ్ఛమైనది అనుకుంటాం కానీ.. ఆ ప్రేమలో కూడా కల్తీది ఉంటుందని తన అనుభవమే నేర్పిందని చెబుతున్నాడు ఈ వ్యక్తి. అతడు ప్రేమ కథను మీరూ చదివేయండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 11 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆమె ఒక చేదు నిజం
Image Credit : chat gpt

ఆమె ఒక చేదు నిజం

నా జీవితంలో ప్రేమ ఒక అందమైన జ్ఞాపకం కాదు.. పెద్ద గుణపాఠం. ఇలా ఎంతమందికి జరిగిందో తెలియదు కానీ నా జీవితంలో మాత్రం ఆ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే చేదు నిజం. అది కాలేజీ మొదటిరోజు. నాకు ఇప్పటికీ ఆ రోజు గుర్తుంది. కొత్త ముఖాలు.. కొత్త వాతావరణం. ఒకరికి ఒకరు పరిచయం కూడా లేదు. ఆ రోజే నేను మొదటిసారి ఆమెను చూసాను. ఒక్కతే ఒక బెంచ్ పై కూర్చుని పుస్తకం చదువుతూ కనిపించింది. ఆమె ముఖం ఎంత ప్రశాంతంగా ఉందంటే.. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించేలా ఉంది? నాకు కూడా అప్పటికీ ఎవ్వరూ పరిచయం కాకపోవడంతో అదే బెంచ్ మీద కూర్చొని ఒక పుస్తకం తీసి చదవడం ప్రారంభించాను. ఆమె మొదటిగా నాతో మాటలు కలిపింది. ఏ బ్రాంచ్ అని అడిగింది. అలా మాటలు కలిపి కాఫీ తాగడానికి వెళ్ళాము. క్యాంపస్ లో నడుస్తూ మెల్లగా స్నేహం చేయడం ప్రారంభించాము. ఆమె ఎంత అందంగా మాట్లాడుతుందంటే గంటలు కూడా సెకన్లలా గడిచిపోతాయి. ఆమెతో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం నాకు పూల తోటలా కనిపిస్తుంది. ఆమెకు ఎలా అనిపిస్తుందో మాత్రం నాకు అర్థం అవ్వలేదు. ఆమెతో జీవితాంతం అలాగే నడవాలనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ తప్పు మీరు చేయకండి
Image Credit : Getty

ఈ తప్పు మీరు చేయకండి

ప్రేమలో ఉన్నప్పుడు మనం చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా? మనం ఎదుటి వ్యక్తిని చూసి ప్రపంచం మొత్తం మర్చిపోతాం. మనల్ని కూడా మనమే మర్చిపోతాం. చదువును, కలలను కూడా పక్కన పెట్టేస్తాం. నేను అదే తప్పు చేశాను. ఆమె ప్రేమ మైకంలో పూర్తిగా మునిగిపోయాను. ఆమె కూడా నా ప్రేమను అర్థం చేసుకుంది. ఒకరోజు తెగించి చెప్పేశాను. ఆమె ఎంతో సున్నితంగా నా ప్రేమను అంగీకరించింది. కాలేజీ చదువు చివరి ఏడాదికి వచ్చేసింది భవిష్యత్తు గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. నేను వేరే సిటీకి వెళ్లి పెద్ద ఉద్యోగం సంపాదించి ఆ తర్వాత ఆమె తన కుటుంబంతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె దానికి సరే అని చెప్పింది. ఆమె కూడా ఉద్యోగరీత్యా వేరే సిటీకి వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నాయి. మొదట్లో రోజుకు పదిసార్లు ఫోన్ చేసేది. ఏడాది అయిన తర్వాత రోజుకి ఒక్కసారి ఫోన్ చేయడమే ఆమెకు కష్టంగా మారిపోయింది. నాకు ఆమె మాట తీరులో చాలా మార్పు కనిపించింది. ఆమె ఎడబాటు చాలా కష్టంగా అనిపించింది. నా జీతం కూడా బాగా పెరగడంతో ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అదే విషయాన్ని ఆమెతో చెప్పాను. కానీ ఆమె పెళ్లి విషయం చెబితే చాలు దూరం పెట్టేది. మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. అప్పుడే పెళ్లి ఏంటి? అని మాట్లాడేది. ఆమె విచిత్రమైన ప్రవర్తన నాకు ఏమీ అర్థం కాలేదు.

34
ఆమె ఇంతగా మారిందా?
Image Credit : Getty

ఆమె ఇంతగా మారిందా?

ఇక ఓపిక పట్టలేక తను పనిచేస్తున్న సిటీకే ఒక రోజు వెళ్లాను. కానీ తనకి ఆ విషయం చెప్పలేదు. తను పనిచేస్తున్న కంపెనీ బయటే కారులో ఉండి ఆమె ఎప్పుడు వస్తుందా? అని చూశాను. ఆమె వచ్చే సమయం అయ్యింది. కానీ ఒంటరిగా రాలేదు.. జంటగా బయటికి వచ్చింది. కొలీగ్స్ కదా కలిసి వస్తే తప్పేంటని మీరు అనుకోవచ్చు. కానీ వారిద్దరి ప్రవర్తన కొలీగ్స్ లాగా లేదు. కంపెనీ నుంచి బయటికి రాగానే అతడు ఆమెను నడుము పై చేయి వేసి నడిపించుకొని నవ్వుతూ తీసుకు వెళుతున్నాడు. ఆమె అతని బైక్ ఎక్కింది.. కానీ సాధారణంగా కాకుండా వారిద్దరి మధ్య అసలు గాలి చొరబడనంత దూరం కూడా లేకుండా హత్తుకుంది. అది చూసి నా గుండె పగిలిపోయింది. ఆమెకు అదే క్షణం ఫోన్ చేశాను. ఆమె నా ఫోన్ చూసి చూడనట్టు కట్ చేసి పెట్టేసింది. రెండు రోజులు తర్వాత తనే చేసింది. చాలా బిజీగా ఉన్నానని అందుకే మాట్లాడటం కుదరలేదు అని చెప్పింది.

44
ఆమె నాకు చేసింది మంచే
Image Credit : Getty

ఆమె నాకు చేసింది మంచే

నేను కావాలనే పెళ్లి గురించి ఆమె మళ్లీ మాట్లాడాను. ఆమె మనిద్దరి దారులు వేరు.. పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పింది. అప్పుడే నాకు అర్థమైంది. ఆమె మరొకరి ప్రేమలో మునిగిపోయిందని. నేను ఆమెతో గొడవ పడదలచుకోలేదు. ఆమె ఇష్టానికి ఆమెను వదిలేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే వదిలేశాను. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎలా ఉందో మాత్రం నాకు తెలియదు. ఆ బ్రేకప్ నాకు పెద్ద గుణపాఠం నేర్పింది. మళ్లీ జీవితంలో ఎవ్వరినీ నేను ప్రేమించలేదు. మా అమ్మానాన్నలు చూసిన అమ్మాయిని చేసుకున్నాను. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె చేసిన మోసం ఇంకా మనసులో అలాగే పచ్చి పుండులా బాధిస్తూనే ఉంది. కానీ నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి నన్ను ప్రాణంలా చూసుకోవడం మొదలుపెట్టింది. గాయం తాలూకు మచ్చలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె బ్రేకప్ చెప్పి నాకు మంచే చేసింది.. నేను మరొక మంచి మనిషితో జీవించే అవకాశాన్ని అందించింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Brush: దువ్వెన ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి? నెలల తరబడి ఒకే దువ్వెన వాడితే ఏమౌతుంది?
Recommended image2
Footwear: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!
Recommended image3
Gold Studs: 2 గ్రాముల్లోనే వచ్చే గోల్డ్ చెవి కమ్మలు
Related Stories
Recommended image1
Oats: ఓట్స్ ఇలా రోజూ తిన్నారంటే త్వరగా బరువు తగ్గే ఛాన్స్
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు IAS, IPS వంటి పెద్ద ప్రభుత్వోద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved