Asianet News TeluguAsianet News Telugu

ఈ అలవాట్లే మన ఫెయిల్యూర్ కు కారణం.. అవేంటంటే?

ఒక వ్యక్తి ఎంత గొప్పగా, ఉన్నతంగా బతకాలనుకుంటున్నాడో అతని ఆలోచనలే చెబుతాయి. ఒక వ్యక్తి మనస్తత్వం, అలవాట్లే ఒక వ్యక్తిని ఉన్నత ఖిఖరాలకు చేర్చుతాయి. నలుగురికీ ఆదర్శంగా చూపిస్తాయి. నలుగురిలో the best అనిపించుకోవాలన్నా.. ఉన్నతమైన job లో స్థిరపడాలన్నా మంచి అలవాట్లు ఉండాల్సిందే. ఈ అలవాట్లవల్లే ఎంతో మంది ప్రముఖులు అంత ఉన్నత స్థానంలో ఉండటానికి ప్రధాన కారణాలు.

five poisonous habits that destroy every man
Author
Hyderabad, First Published Jan 16, 2022, 1:03 PM IST

ఒక వ్యక్తి ఎంత గొప్పగా, ఉన్నతంగా బతకాలనుకుంటున్నాడో అతని ఆలోచనలే చెబుతాయి. ఒక వ్యక్తి మనస్తత్వం, అలవాట్లే ఒక వ్యక్తిని ఉన్నత ఖిఖరాలకు చేర్చుతాయి. నలుగురికీ ఆదర్శంగా చూపిస్తాయి. నలుగురిలో the best అనిపించుకోవాలన్నా.. ఉన్నతమైన job లో స్థిరపడాలన్నా మంచి అలవాట్లు ఉండాల్సిందే. ఈ అలవాట్లవల్లే ఎంతో మంది ప్రముఖులు అంత ఉన్నత స్థానంలో ఉండటానికి ప్రధాన కారణాలు. అయితే కొందరికి గొప్ప ఆలోచనలున్నా.. ఆచరణలోకి వచ్చే సరికి వెనకడుగు వేస్తుంటారు. ఆ పొరపాటే మనిషి నాశనానికి మూల కారణం. ఒక వ్యక్తిని గొప్ప Position లో నిలబెట్టడానికి ఈ 5 అలవాట్లు ఎంతో అవసరం. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

అతి ఆలోచన:  చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు అతిగా ఆలోచిస్తుంటారు. గోరంత విషయాన్ని కూడా కొండంత చేసి ఏమౌతుంది, దీనికి నేను ఏం చేయాలి, అయ్యో ఇప్పుడెట్లా అని తెగ ఇదై పోయి నెత్తిని పాడుచేసుకుంటారు. ఆ చిన్న విషయానికి కూడా ఇంతగా ఆలోచించాలా.. లేదా.. అనేది కూడా అర్థం అవకుండా నానా ఆలచనలతో తెగ సతమతమవుతుంటారు. మనస్సును, మెదడును పాడు చేసే అతి ఆలోచనలు అనారోగ్యానికి కారణం. సో over thinking కు సాధ్యమైనంత దూరంగా ఉండండి. దీనివల్ల ఒరిగేది ఏమీ ఉండదని అర్థం చేసుకోండి. వీలైతే ఏదైనా పనిలో మునగడం ఉత్తమం.

వాయిదా వేయడం: పొద్దున లేచిన వెంటనే ఇది చేయాలి, అది చేయాలి అని పడుకునే ముందే ఎన్నో కలలు గంటాం. పొద్దొన లేచినాక అవి నిజంగానే కళలు గానే మిగిలిపోతుంటాయి చాలా మందికి. ఎన్ని ఆలోచనలు వచ్చినా.. దాన్ని ఆచరించకపోతే అంతా ఉత్త ముచ్చటనే. జీవితంలో విజయం సాధించాలంటే కేవలం లక్ష్యాలు ఒక్కటే కాదు ఆచరణ కూడా అవసరమే. ఈ పనులను రేపు చేస్తా, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తా అంటే ఎప్పటికీ నువ్వు ఎదగలేవు. అందుకే ఏదైనా సాధించాలనుకున్నప్పుడే వెంటనే ఆచరణ మొదులు పెట్టి విజయాన్ని సాధించు. అంతే కాని వాయిదా అంటూ పోతే ఉన్న పుణ్యకాలం కాస్త గడిపోతుంది. 

పోల్చుకోవడం:  ఇది అయితే ఉద్దెర ముచ్చటనే చెప్పాలి. ఎందుకంటే పోల్చుకోవడమంత పనికిమాలిన పనిమరోటి లేదుగనక. వాళ్లు ఇంత సంపాదిస్తున్నారు. నేను సంపాదించాలి. పక్కింటామే నగలు కొన్నదని నేను కొనాలి అనుకోవడం పెద్ద పనికి మాలిన పనే అంటారు. ఎందుకంటి ఎదుటివారు మీరు ఒక్కటే అని ఎప్పుడూ అనుకోకండి. పక్కవాళ్లకంటే మీకు ఎక్కువ సామర్థ్యం ఉండొచ్చు. వాళ్లకంటే ఇంకా ఎక్కువ ఉన్నత స్థానంలో నిలవొచ్చు కదా. ఎవరి సామర్థ్యం ఎంతుందో ఎవ్వరం చెప్పలేం. నీవు కూడా అంతే.. నిన్ను నువ్వు గొప్ప వ్యక్తిగా భావించు. ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకో. దానికి తగ్గట్టు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు అడుగులు వెయ్యడమే నీవు చేయాల్సిన అతి ముఖ్యమైన పని.

ఫిర్యాదు చేయడం:  ఈ అలవాటు చాలా డేంజర్. మనలో సత్తా లేనప్పుడే పక్కవాళ్లపై చాడీలు, ఫిర్యాదులు చేస్తుంటాం. ఇది ఒప్పుకోవాలంటే కష్టమే. కానీ వాస్తవం మాత్రం ఇదే. ఈ లోకంలో తప్పు చేయకుండా ఎవరూ ఉండరు. తప్పు చేస్తే ‘అది నేనే చేసా’ఇలా జరిగిందని చెప్పడం అలవాటు చేసుకోండి. అంతేకానీ నా తప్పు ఏమీ లేదు అని అంతా పక్కవారిపై చాడీలు చెప్పడం దరిద్రపు అలవాటు.  

సేఫ్ జోన్: మనం ఏ పని చేసినా ఏ తప్పులు లేకుండా, రిస్క్ లేకుండా చేయాలనుకుంటాం. అలా ఉండాలంటే కావాల్సింది మంచి అలవాట్లు, మన దశను నిర్దేశించే మార్గాలు. ఉన్నతమైన ఆలోచనల మూలంగానే మనం సేఫ్ గా, ఎలాంటి రిస్క్ లేకుండా జీవించగలుగుతాం. అవి ఊరికే వస్తాయా అంటే కుదరని పని. ముందు యుద్దం చేయాలి. ఆ తర్వాత ఆటోమెటిక్ గా గెలుపు వరిస్తుంది. అందుకే జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని అలవాట్లు తప్పక అలవర్చుకోవాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios