షాకింగ్ న్యూస్.. పురుషుల వీర్యకణాలపై సన్ స్క్రీన్ లోషన్ ఎఫెక్ట్..?

Evidence mounts that sunscreen could weaken sperm
Highlights

. పురుషులు యూవీ రేస్ నుండి చర్మం రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ ను వారి శరీరానికి అప్లై చేయడం వల్ల, లోషన్ లోని కెమికల్స్ శరీరంలోనికి ఇంకి అవి రక్తంలో శరీరభాగాలన్నింటికి వ్యాప్తి చెండంతో స్పెర్మ్ మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎండాకాలంలో యూవీ రేస్ నుంచి రక్షించుకోవడానికి చాలా మంది సన్ స్క్రీన్ లోషన్ ని వాడుతుంటారు. అది రాసుకుంటే.. ట్యాన్ సమస్య నుంచి బయటపడొచ్చు. అయితే.. అదే సన్ స్క్రీన్ లోషన్ కారణంగా పురుషుల్లో కొత్త సమస్యలు తలెత్తున్నాయట. మీరు చదివింది నిజమే.. సన్ స్క్రీన్ లోషన్ పురుషుల వీర్యకణాలపై ఎఫెక్ట్ చూపిస్తుందట.

రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో పురుషులు సన్ స్క్రీన్ లోషన్ వాడటం వల్ల స్పెర్మ్ క్వాలిటి తగ్గుతుందని కనుగొన్నారు. పురుషులు యూవీ రేస్ నుండి చర్మం రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ ను వారి శరీరానికి అప్లై చేయడం వల్ల, లోషన్ లోని కెమికల్స్ శరీరంలోనికి ఇంకి అవి రక్తంలో శరీరభాగాలన్నింటికి వ్యాప్తి చెండంతో స్పెర్మ్ మీద ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కానీ అన్ని రకాల సన్ స్క్రీన్ లోషన్ బ్రాండ్ ఇలా ఉండవు, కొన్ని ప్రత్యేకమైన లోషన్స్ లో మాత్రమే కెమికల్స్ పురుషుల స్పెర్మ్ మీద ప్రభావం చూపుతుంది. కెమికల్స్ తో నిండిన రక్తం పునరుత్పత్తి అవయావాలకు చేరడం వల్ల ఆ ప్రదేశంలో నీరు చేరుతుంది. సన్ స్క్రీన్ లో ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ సంతానానికి సహాయపడే స్పెర్మ్ సెల్స్ , ఎగ్స్ మీద ప్రభావం చూపుతుంది. 

ఇది నమ్మశక్యం కాకపోయినా...చాలా మంది పురుషులు సంతానలేమితో డాక్టర్లను కలిసినప్పుడు ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి . కాబట్టి, పిల్లలకోసం ప్రయత్నించే వారు, ఆ పర్టిక్యులర్ సమయంలో సన్ స్క్రీన్ లోషన్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

loader