Asianet News TeluguAsianet News Telugu

Ganesh Chaturthi 2022: వినాయక చవితి రోజు చంద్రుడిని చూశారా? దోష నివారణ కోసం వెంటనే ఇలా చేయండి!

Ganesh Chaturthi 2022: హిందువుల పండుగలలో అతి ముఖ్యమైన పండగ వినాయకచవితి ఒకటి. dosha nivarana for seeing moon on ganesh chaturthi 2022 know full details inside

dosha nivarana for seeing moon on ganesh chaturthi 2022 know full details inside
Author
First Published Aug 31, 2022, 8:51 AM IST

వినాయక చవితిని హిందూ మతస్తులు అందరూ ఎంతో వేడుకగా ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు గణనాథుడికి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించి వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు.

ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద శుక్ల చతుర్థి సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుడిని చూస్తే భవిష్యత్తులో అపవాధాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చంద్రుడి చూడవద్దు అని చెబుతారు.

ఇక పొరపాటున చంద్రుడిని చూస్తే మాత్రం దోషం రాకుండా ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. అయితే చంద్రుడిని ఎందుకు చూడవద్దు పురాణంలో ఒక కథ ఉంది. గణేశుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసిన తర్వాత  ఆది పూజ్యుడిగా నియమింపబడుతాడు. ఆ సమయంలో వినాయకుడిని ముక్కోటి దేవతలు ఆరాధించి పూజిస్తారు.

కానీ చంద్రుడు మాత్రం తన రూపాన్ని, తన అందాన్ని సర్వంగా తలుచుకొని చంద్రుడికి పూజ చేయడు. దీంతో గణేశుడు చంద్రుడిపై ఆగ్రహంతో మెల్లగా ఉండని శపిస్తాడు. ఆ తర్వాత చంద్రుడు తన తప్పును వేడుకోమంటాడు. దాంతో సూర్య భగవానుని కాంతి చంద్రుడిపై పడటం వల్ల తిరిగి మునుపటి రూపం వస్తుందని వినాయకుడు చెబుతాడు. అలా మునిపటి రూపం తెచ్చుకుంటాడు చంద్రుడు.

అందుకే ఆ రోజున వినాయకుడిని దర్శించుకోవద్దు అని పురాణాలు చెబుతున్నాయి. పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే.. ముందుగా గణపతిని పూజించి పండ్లు, పూలు సమర్పించి ఆ తర్వాత చంద్రుడికి చూపించి పేదవాడికి దానం చేయాలి. అంతేకాకుండా ఒక మంత్రాన్ని పటించిన కూడా దోషం తొలగిపోతుంది. ఇక ఆ మంత్రం ఏంటంటే.. సింహం ప్రసేనుని చంపగా, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణి కోసం ఓ సున్నిత మనస్కుడా ఏడవకు. ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పటించాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios