Asianet News TeluguAsianet News Telugu

Tea Effects: మీ పిల్లలకు టీ అసలే తాపొద్దు.. ఎందుకంటే..?

Tea Effects: చాలా మంది పిల్లలు టీ తాగకపోతే గాయిగాయి చేస్తుంటారు. ఎందుకంటే మీ పిల్లలు ఇప్పటికే టీ కి బాగా Addict అయ్యారు కాబట్టి. టీ తాగితే వాళ్లు హ్యాపీగా ఆడుకుంటారు. ఎనర్జీ వస్తుందని మీరు పొరబడొచ్చు. కానీ పిల్లలకు టీ తాగిస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో మీరు ఊహించలేరు. 12 ఏండ్ల కంటే తక్కువ వయస్సున పిల్లలకు గ్రీన్ టీ, టీలు తాగిచించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

Do your children drink tea? However many unhealthy issues come up
Author
Hyderabad, First Published Jan 13, 2022, 5:15 PM IST

Tea Effects: చాలా మంది పిల్లలు టీ తాగకపోతే గాయిగాయి చేస్తుంటారు. ఎందుకంటే మీ పిల్లలు ఇప్పటికే టీ కి బాగా Addict అయ్యారు కాబట్టి. టీ తాగితే వాళ్లు హ్యాపీగా ఆడుకుంటారు. ఎనర్జీ వస్తుందని మీరు పొరబడొచ్చు. కానీ పిల్లలకు టీ తాగిస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో మీరు ఊహించలేరు. 12 ఏండ్ల కంటే తక్కువ వయస్సున పిల్లలకు గ్రీన్ టీ, టీలు తాగిచించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. 

పెద్దలు, చిన్నలు అంటూ తేడా లేకుండా నేడు చాలా మంది టీ కి బాగా అలవాటు పడిపోయారు. బెడ్ ఛాయ్ గొంతులో పడనిదే బెడ్ కూడా దిగని వారు చాలా మందే ఉన్నారు. ఇంకొందరైతే ఛాయ్ లేకపోతే ఏదో మిస్ అయ్యిందని గాయి గాయి చేసి.. పిచ్చి పట్టినట్టుగానే ప్రవర్తిస్తుంటారు. దానికి కారణం వాళ్లు పూర్తిగా టీ కి   Addict అవ్వడమే కారణం. వీళ్లు టీ తాగనిదే ఏ పని చేయలేరు. కూలీ పని చేసే వారి నుంచి మొదలు పెడితే ఏసీ రూముల్లో పనిచేసే వారి వరకూ టీని రోజుకు రెండు నుంచి 6 కప్పుల వరకు లాగించేస్తుంటారు. పెద్ద వారి సంగతి పక్కన పెడితే చిన్నపిల్లలు కూడా పొద్దుకు రెండు నుంచి మూడు సార్లు టీని తాగుతున్నారు. చూడ్డానికి మనకు మంచిగానే ఉన్నా.. అలా పిల్లలు టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఓ అధ్యయనం వెళ్లడించింది. 

ప్రతిరోజూ పిల్లలు టీ ని తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. అలాగే పిల్లలు తరచుగా ఆందోళనకు గురవుతారు. అయితే టీ ని తాగే పిల్లల్లో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల పిల్లలకు నిద్రలేమి సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటుగా తల తిరగడం, తలనొప్పి వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇకపోతే 12 ఏండ్ల లోపున్న పిల్లలకు గ్రీన్ టీ కూడా తాగించొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రీన్ టీ ఆకుల్లో థెయిన్, కెఫిన్, టానిక్ లు అధికంగా ఉంటాయి. అయితే దీన్ని తాగడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వీటితో పాటుగా టీ తాగితే  Gastric ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది . అయితే టీ లో కెఫిన్ అధిక మొత్తంలో ఉంటుంది. దీన్ని పిల్లలు తాగితే మూత్రవిసర్జన సమస్య కూడా వస్తుంది. ముఖ్యంగా టీ అలవాటు వారి ఎదుగుదలపై దెబ్బ పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అజీర్తి సమస్యతో పాటుగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెళ్లడిస్తున్నారు.  పిల్లలు బలహీనంగా మారడం, బరువు పెరగడం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని కొన్ని సమయాల్లో మానసిక సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అందుకే టీ కి బదులుగా పిల్లలకు పాలను అలవాటు చేయండి. ఆవు పాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios