Asianet News TeluguAsianet News Telugu

దీపావళి స్పెషల్ స్వీట్స్ టెంప్ట్ చేసినప్పుడు మధుమేహాన్ని ఎలా నియంత్రించాలో తెలుసా?

స్వీట్లను తినని వారు అస్సలు ఉండరేమో.. ఇక దీపావళీ స్పెషల్ స్వీట్లు  మనల్ని ఎలా టెంప్ట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇవెంత రా.. రామ్మని పిలిచినా.. షుగర్ పేషెంట్లు మాత్రం అస్సలు తినకూడదు.. లేదంటే రక్తంలో షుగర్ లెవెల్స్ దారుణంగా పెరిగే అవకాశం ఉంది. 
 

Diwali 2022: how to control diabetes while being tempted by diwali sweets
Author
First Published Oct 20, 2022, 3:08 PM IST

పండుగ ఏదైనా సరే.. స్వీట్లు మాత్రం పక్కాగా ఉండాల్సిందే.. అసలు స్వీట్లు లేకుండే పండుగ పూర్తి కాదేమో.. అందులో దీపావళికి అయితే రకరకాల స్వీట్లు నోరూరిస్తాయి. వాటిని చూస్తే తినకుండా ఉండటం చాలా కష్టమబ్బా.. కానీ స్వీట్లను ఎక్కువ తినడం మరీ అంత మంచిది కాదు.. ముఖ్యంగా స్వీట్లు మధుమేహులకు అస్సలు మంచివి కావు. ఏదైతే అది ఐతదని స్వీట్లను తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మరి మధుమేహులు స్వీట్లను చూసినప్పుడు వాళ్లను వారు కంట్రోల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

బీటో అధ్యయనం ప్రకారం.. పండుగల సమయాల్లోనే  రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ముఖ్యంగా దీపావళీ సమయంలో. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 250 మి.గ్రా / డిఎల్ స్థాయిలు ఉన్న వ్యక్తుల్లో దీపావళి సమయంలో  ఇది దాదాపు  15 శాతం పెరుగుతుందట. ఇక 300 మి.గ్రా/డిఎల్ కంటే ఎక్కువ ఉన్నవారిలో ఏకంగా 18 శాతం షుగర్ లెవెల్స్ పెరిగాయట. ఇది దీపావళి తర్వాత కొన్ని రోజుల  వరకు కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ పండుగ సీజన్ లో మధుమేహాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం పదండి. 

  • భోజనాన్ని టైం ప్రకారం చేయండి. మందులను మర్చిపోకుండా వాడండి. భోజనాన్ని స్కిప్ చేయడం లేదా లేట్ గా తినడం వల్ల.. మీరు అతిగా తినే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేందుకు దారితీస్తుంది. 
  • శుద్ధి చేసిన చక్కెరతో చేసిన స్వీట్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్, నట్స్, ఫ్రూట్స్ వంటి హెల్తీ స్నాక్స్ నే తీసుకోండి. ఒక వేళ మీరు స్వీట్లను ఖచ్చితంగా తినాలి అనుకుంటే.. ఇంట్లోనే చక్కెర లేని స్వీట్లను తయారుచేయించుకుని తినండి. అలాగే రోజంతా మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. మీకు నచ్చిన స్వీట్ ముక్కను కొద్దిగా తినొచ్చు. కానీ ఎక్కువగా తినకూడదు. 
  • మిల్క్ చాక్లెట్ కు బదులుగా డార్క్ చాక్లెట్లనే తినండి. ఎందుకంటే వాటిలో తక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. షుగర్ ఉండే పానీయాలకు దూరంగా ఉండండి. వీటికి బదులుగా నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా నార్మల్ వాటర్ వంటి షుగర్ లేని రసాలనే తాగండి. 
  • మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ నే తినండి. ఎందుకంటే వైట్ రైస్ లో గ్లైసెమిక్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. 
  • బిస్కెట్లు, కేకులు వంటి బేకరీ ఫుడ్ ఐటమ్స్, సమోసాలు, పకోడీలు వంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకపోవమే మంచిది. 
  • పండుగ వేళ ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ లో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
  • పండుగ అయినా సరే మర్చిపోకుండా కనీసం రోజుకు 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. 
Follow Us:
Download App:
  • android
  • ios