Asianet News TeluguAsianet News Telugu

ఈ పాటలో కత్రినా ని చూస్తే... చూపు తిప్పుకోలేరు..!

పాట విడుదల చేసిన కొద్ది గంటలకే మిలియన్ కొద్దీ వ్యూస్ లు వచ్చిపడుతున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 
 

Can not Take Our Eyes Off Katrina Kaif In This BTS Clip From Sooryavanshi Song Tip Tip
Author
Hyderabad, First Published Nov 8, 2021, 11:39 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కత్రినా కైఫ్.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో వెయ్యి వీణలు మోగినట్లు అవుతుంది. ఆమె అందం, రూపు, రంగు, నటన.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు.  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం అవుతున్నా.. ఇప్పటికీ వన్నెతరగని అందంతో ఆకట్టుకుంటూనే ఉన్నారు.

తాజాగా.. కత్రినా కైఫ్ సూర్యవంశీ సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆమె సినిమాలో ఆమె టిప్ టిప్ అనే  పాటకు స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఆ పాట ఇంటర్నెట్ లో  సంచలనాలు రేపుతోంది. పాట విడుదల చేసిన కొద్ది గంటలకే మిలియన్ కొద్దీ వ్యూస్ లు వచ్చిపడుతున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఈ పాటకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

 

ఈ సినిమాలో కత్రినా సరసన అక్షయ్ కుమార్ నటించారు. పాటలో వీరిద్దరి కెమిస్ట్రీకి  అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పాటకు ఫరాఖాన్ కొరియోగ్రఫీ చేశారు. కాగా.. తాజాగా.. ఈ పాట షూటింగ్ సమయంలో తీసిన ఓ క్లిప్ ని కత్రినా కైఫ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

టిప్ టిప్ సాంగ్ కి సంబంధించిన వీడియో కావడం విశేషం. ఆ పాటలో కత్రినా.. మెటాలిక్  చీర ధరించి ఉన్నారు. పాట  మొత్తం వర్షం సెటప్ లో చిత్రీకరించారు. ఈ పాటలో ఇప్పుడు కత్రినా చూసి.. అభిమానులు కనీసం చూపు కూడా తిప్పుకోలేకపోతున్నారు.  ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. కత్రినా.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. విక్కీ కౌశల్, కత్రినా వివాహం డిసెంబర్ లో జరుగబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు కత్రినా, విక్కీ కౌశల్ ల 'రోకా' వేడుక దీపావళి సందర్భంగా సీక్రెట్ గా జరిగినట్లు బాలీవుడ్ మీడియా టాక్. రోకా వేడుక అంటే పెళ్ళికి ముందు ఇరు కుటుంబాల సభ్యులు ఒకచోట కూర్చుని అన్ని విషయాలు చర్చించుకునే చిన్న ఫంక్షన్. 

అయితే కొందరు మాత్రం నిశ్చితార్థమే జరిగిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా దీపావళి సందర్భంగా కత్రినా, విక్కీ వివాహానికి సంబంధించిన చిన్న వేడుక జరిగింది. దీని గురించి కత్రినాకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి బాలీవుడ్ మీడియాకు వివరించారట. ఫంక్షన్ అద్భుతంగా జరిగింది. కత్రినా లెహంగాలో మెరిసింది అని చెప్పారట. ఈ వేడుక దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో సీక్రెట్ గా జరిగినట్లు చెబుతున్నారు. కత్రినా.. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఏక్ థా టైగర్, న్యూయార్క్ చిత్రాల్లో నటించింది. కబీర్ ఖాన్ ని కత్రినా సొంత బ్రదర్ లా భావిస్తోందట. అందుకే రోకా వేడుకని ఆయన ఇంట్లో ప్లాన్ చేసుకుంది. 

ఇక వివాహ వేడుక రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ లో ఉన్న ఒక కోటలో జరుగబోతున్నట్లు టాక్. దీనికి కూడా కత్రినా చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుందట. మొత్తంగా కత్రినా, విక్కీ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios