‘‘ మొన్ననే నా బాయ్ ఫ్రెండ్ తో విడిపోయాడు..రేపు పార్టీకి వెళ్లడానికి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు’’, ‘‘ ఇప్పటి వరకు నాకు అసలు బాయ్ ఫ్రెండే లేడు..’’ ఇలాంటి సమస్యలు మీకు కూడా ఉన్నాయా.. అయితే.. మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. మీ నచ్చిన బాయ్ ఫ్రెండ్ ని అద్దెకు కొనుక్కోవచ్చు. ఎన్ని రోజులకు కావాలంటే అన్ని రోజులు డబ్బులు చెల్లించి వారిని అద్దెకు తెచ్చుకోవచ్చు.

ప్రస్తుతం డేటింగ్ యాప్ ల కాలం నడుస్తోంది. టిండర్, ట్రూలీ మ్యాడ్లీ లాంటి యాప్ ల పేర్లు మీరు వినే ఉంటారు. ఇది కూడా ఒకవిధంగా డేటింగ్ యాప్ లాంటిదే. దీనిపేరు ‘రెంట్ ఏ బాయ్  ఫ్రెండ్’ .కాకపోతే ఇందులో బాయ్ ఫ్రెండ్స్ ని అద్దెకు కొనుక్కోవచ్చు. కౌశల్ ప్రకాశ్(29) ఈ యాప్ సృష్టికర్త. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా దీనిని రూపొందించారు.

ఇందులో చాలా ఆఫ్షన్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో కూడా ఎంచుకోవచ్చు. సెలబ్రెటీ బాయ్ ఫ్రెండ్, మోడల్ బాయ్ ఫ్రెండ్, నార్మల్ బాయ్ ఫ్రెండ్. ఇలా రకాలు ఉంటాయి. వాటిలో మీరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. 

సెలబ్రెటీ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకు రూ.3వేలు, మోడల్ బాయ్ ఫ్రెండ్స్ కి గంటకు రూ.2వేలు, నార్మల్ పీపుల్ అయితే గంటకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం 10-15 నిమిషాల సమయం చాలు అంటే రూ.500 పే చెయొచ్చు. వాళ్లతో ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు తిరగొచ్చు.. ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఇది అమ్మాయిలకు మాత్రమే బెనిఫిట్ అనుకుంటే పొరపాటే.

దీనిని అబ్బాయిలు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ గా వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నవారు కూడా ఈ యాప్ నిర్వాహకులను సంప్రదించవచ్చు. దీనిని ఓ ఉద్యోగంలా పాటించే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది.

పార్టీలకు వెళ్లడం మాత్రమే కాదు.. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా.. డిప్రెషన్ లో ఉన్న ఆ అద్దె బాయ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. వాళ్లు మీ ఒత్తిడ తగ్గించేందుకు హెల్ప్ చేస్తారు.