అందానికి గ్రీన్ టీ

గ్రీన్‌ టీ ఉపయోగించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కొందరిలో పాదాలకు ఎక్కువ చెమట పట్టడం వల్ల వాటి నుంచి దుర్వాసన వస్తుంది.

5 beauty benefits of  green tea

గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే.. ఆరోగ్యం మాత్రమే కాదు.. గ్రీన్ టీ అందాన్ని కూడా ఇస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

 చర్మం పొడిబారినప్పుడు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చల్లని గ్రీన్‌టీతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మురికి తొలిగిపోయి, పొడిబారే సమస్య కూడా తగ్గుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది. వాడేసిన టీ బ్యాగులను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని కాసేపు కళ్లపై పెట్టుకుని చూడండి. కళ్ల వాపు తగ్గుతుంది. నల్లటి వలయాల సమస్య కూడా దూరం అవుతుంది. 

తలస్నానం చేసే ముందు బ్లాక్‌ టీని తలంతా రాసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తరువాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు చిట్లడం తగ్గుతుంది. గ్రీన్‌ టీ ఉపయోగించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. కొందరిలో పాదాలకు ఎక్కువ చెమట పట్టడం వల్ల వాటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇలాంటివారు పెద్ద గిన్నెడు నీళ్లలో రెండు కప్పుల గ్రీన్‌టీ డికాక్షన్‌ వేసి బాగా వేడిచేయాలి. ఆ నీటిని టబ్బులో వేసి పాదాల్ని కాసేపు అందులో ఉంచాలి. చెమట సమస్య తగ్గడమే కాదు, పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. 

వ్యాక్సింగ్‌ చేసుకున్నప్పుడు చర్మం ఎర్రగా కందిపోయి కొన్నిసార్లు దురదగా అనిపించొచ్చు. సమస్య ఉన్నచోట చల్లని టీబ్యాగుల్ని కాసేపు ఉంచడం వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios