మీ జుట్టు సంరక్షణ కోసం రకరకాల షాంపూలు, ఆయిల్స్, కండిషనర్స్ ఉపయోగించారా ? జుట్టు ఒత్తుగా కనిపించడానికి రకరకాలుగా ప్రయత్నించారా ? కానీ ఫలితం కనిపించడం లేదా..? బాధపడకండి..ఖరీదైన ఆయిల్స్, షాంపూలు అవసరం లేకుండా  కేవలం కోడిగుడ్డుతో మీ జుట్టుని అందంగా, ఆరోగ్యంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ఎగ్ హెయిర్ కి మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఎగ్ లో ఉండే పోషకాలు కురుల సౌందర్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. రెగ్యులర్ హెయిర్ కేర్ లో ఎగ్ ని చేర్చుకోవడం వల్ల మీ జుట్టు రెండు రెట్లు వేగంగా పెరుగుతుంది. ఎగ్ లో విటమిన్ ఏ, డి, ఈ, కే ఉంటాయి. ఇవి జట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి.

డ్రై హెయిర్...( కోడిగుడ్డు, తేనె)
1గుడ్డులోని పచ్చసొన, 1టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుకి, స్కాల్ప్ కి అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇది డ్రై హెయిర్ ని నివారించడంతో పాటు, జుట్టుకి షైనింగ్ ని, స్మూత్ నెస్ ని ఇస్తుంది.

ఆయిలీ హెయిర్(కోడిగుడ్డు, ఆలివ్ ఆయిల్)
1గుడ్డులోని తెల్లసొన, టీస్పూన్ ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుని పాయలుగా విడదీసి.. ఈ ప్యాక్ ని అప్లై చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది ఆయిలీ హెయిర్ నివారించడంతో పాటు, జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

కండిషనర్( కోడిగుడ్డు, పెరుగు)
ఒక కప్పు పెరుగు, 1 గుడ్డులోని తెల్లసొన, కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత, జుట్టు బిగుతుగా మారిన తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి అప్లై చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

డ్యామేజ్ హెయిర్( కోడిగుడ్డు, కలబంద)
గుడ్డులోని పచ్చసొన, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా అప్లై చేయాలి. జుట్టుకి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.