ఒక గ్రాములో సింపుల్ చెవి రింగుల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము సింపుల్ డిజైన్లు ఇచ్చాము. ఇక్కడ మేము ఇచ్చిన డిజైన్లలో బంగారు చెవి రింగులు మీకు నచ్చే అవకాశం ఉంది. 

తక్కువ బరువున్న, రోజూ పెట్టుకునే బంగారు చెవి రింగులకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే 1 గ్రాము బంగారు చెవిరింగుల కోసం అధికంగా వెతుకుతూ ఉంటారు. ఇవి బడ్జెట్‌కు తగ్గట్టుగా ఎంపిక చేసుకోవచ్చు కూడా. బరువైన బంగారు డిజైన్ల లాగానే ఈ ఒక గ్రాము బంగారు చెవి రింగులు కూడా రిచ్‌గా, ట్రెండీగా కనిపిస్తాయి. ఆఫీస్‌లకు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఈ తేలికపాటి బంగారు నగలు అందంగా ఉంటాయి. 1 గ్రాము బంగారు చెవిరింగులు అందరికీ నప్పుతాయి. తక్కువ రేటులో, తక్కువ బరువులో బంగారు చెవిరింగుల కోసం వెతుకుతున్నారా? ఇక్కడిచ్చిన ట్రెండీ డిజైన్లు చూడండి.

సాలిటైర్ డ్రాప్ బంగారు చెవిరింగు డిజైన్

సన్నని బంగారు రింగ్ కింద చిన్న రౌండ్ సాలిటైర్ స్టోన్ వేలాడుతూ ఉండే డిజైన్ ఇది. ఇవి తేలికగా ఉన్నాకూడా ఈ డిజైన్ రిచ్‌గా, క్లాసీగా కనిపిస్తుంది. మీరు వేసుకునే ఫార్మల్ వేర్, ఫ్యూజన్ డ్రెస్సులతో కూడా ఇవి పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. దీని డ్రాప్ ఎఫెక్ట్ ఉన్న ఈ చెవి రింగులు ముఖాన్ని పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తాయి. రోజూ పెట్టుకోవడానికి ఇది మంచి ఎంపిక.

ముత్యం, బంగారు చిన్న స్టడ్ డిజైన్

చిన్న ముత్యంతో కూడిన చిన్న స్టడ్స్ చాలా అందంగా ఉంటాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. సూట్లు, కాటన్ చీరలు, కుర్తా-పైజామాలు వేసుకునే వారు ప్రతిరోజూ వీటిని పెట్టుకోవచ్చు. ఈ స్టడ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. పూజకు, ఆఫీస్‌కు రోజూ పెట్టుకోవడానికి ఎంతో అందంగా ఉంటాయి.

పువ్వు కట్ అవుట్ డిజైన్ తో

కొత్త తరానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన చెవిరింగులు ఇవి. సన్నని బంగారు షీట్‌పై పువ్వు ఆకారంలో కట్ చేసి వీటిని తయారు చేస్తారు. చాలా తేలికగా ఉంటాయి. చూసేందుకు ఇవి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ప్లెయిన్ టాప్ లేదా జీన్స్ టీషర్ట్ కాంబోతో వీటిని పెట్టుకుంటే మీరు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.

ఆకు ఆకారంలో డాంగ్లర్ డిజైన్

చిన్న ఆకు ఆకారంలో ఉన్న చెవి రింగులు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ చిన్న డాంగ్లర్లు ఆఫీస్ కు బాగుంటాయి. సింపుల్ గా ఉండాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక. సింపుల్ కుర్తా లేదా చీరపై ఇవి అందంగా కనిపిస్తాయి. వీటిని నిత్యం పెట్టుకున్నా చెవులు బరువుగా అనిపించవు.

సన్నని బంగారు స్ట్రిప్‌పై చిన్న చిన్న జర్కన్ స్టోన్స్ ను పొదిగి ఉంచే డిజైన్లలో చెవిరింగులు ఎన్నో ఉన్నాయి. ఏ దుస్తులకైనా ఇవి అందాన్నిస్తాయి. చూసేందుకు మాత్రం ఇవి సింపుల్ కనిపిస్తాయి. చిన్న పార్టీలకు ఇవి అందంగా కనిపిస్తాయి.

క్లాసిక్ హూప్ చెవిరింగు డిజైన్

1 గ్రాము బంగారంలో అందరికీ నచ్చే డిజైన్ ఇదే. చిన్న గుండ్రని హూప్ రింగ్… ఇవి అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. ఎప్పుడైనా ఇవి మంచి ఫ్యాషన్ అని చెప్పుకోవాలి. వెస్ట్రన్ డ్రెస్సులపైనా, ఇండియన్ దుస్తులపైనా కూడా వీటిని పెట్టుకోవచ్చు. వీటిని ప్రతిరోజూ తీయాల్సిన అవసరం లేదు. నిత్యం ఉంచేసుకోవచ్చు.