Asianet News TeluguAsianet News Telugu

జీరో బడ్జెట్.. ఇంటి మీది పంట(వీడియో)

మనం తీసుకుంటున్న ఆహారం ఎంత వరకు ఆరోగ్యం..? ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి అంటున్న రూఫ్ గార్డెన్ సృష్టికర్త రఘెత్తమ రెడ్డి

'inti panta' special story of roof garden

ఒకప్పుడు కూరగాయలు కొనేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ప్రతి ఒక్కరూ.. ఇంటి చుట్టూ వీలైనన్నీ కూరగాయలు, ఆకుకూర మొక్కలను పెంచుకునేవారు. వాటినే ఇంట్లో వంటకి కూడా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అంతా అపార్ట్ మెంట్ సంస్కృతి పెరిగిపోయింది. మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నా.. పెంచడానికి కొద్దిగ భూమి కూడా కనిపించడం లేదు. దీంతో చాలా మంది ఆ దిశగా ఆలోచనలు కూడా చేయడం లేదు. కూరగాయల రేటు ఎంత పెరిగినా.. చచ్చినట్టు కొనడం ఆనవాయితీగా మారిపోయింది.

 

అయితే.. ఒక ఆయన మాత్రం ఈ పద్దతి నేను పాటించను.. మా కూరగాయలు మేమే పండించుకుంటాం అంటున్నారు. ఆయనే తమ్మేటి రఘోత్తమరెడ్డి.  అలా అని ఒకటి రెండు మొక్కలు పెంచి ఊరుకోలేదు. ఆయన గార్డెన్ లో దొరకని కూరగాయ అంటూ ఉండదు. కేవలం కూరగాయలేనా.. పండ్లు కూడా ఉన్నాయి. ఏదైనా పల్లెటూర్లో పెంచాడేమో అని పొరపాటు పడకండి. ఎందుకంటే.. ఈ గార్డెన్ కి నీరు పోసింది హైదరాబాద్ నగరంలోనే. ఈ గార్డెన్ ప్రత్యేకతేంటో తెలుసా.. ఇది రూఫ్ గార్డెన్. మొత్తం రూఫ్ మీదే ఈ మొక్కలను పెంచారు. మరి దీని విశేషాలేంటో మనమూ చూసేద్దామా...
 

Follow Us:
Download App:
  • android
  • ios