సికింద్రాబాద్ సమీపాన ఆర్‌కేపురంలోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ లో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సరైన అర్హతలు కలిగి ఉన్నవారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

సికింద్రాబాద్‌ దగ్గరలోని ఆర్‌కేపురంలో ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భ‌ర్తీకి సంబంధింత విభాగాల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి తుది గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read PSC jobs: పబ్లిక్ సర్వీస్ కమిషన్(సివిల్)లో అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీల ప్రకటన


వివిధ టీచింగ్ పోస్టుల వివ‌రాలు.

మొత్తం ఖాళీలు: 46

పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌ (టీజీటీ), ప్రైమ‌రీ టీచ‌ర్ (పీఆర్‌టీ).

సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు.
ఇంగ్లిష్-23, హిందీ-02, సంస్కృతం-02, హిస్టరీ-01, పొలిటికల్ సైన్స్-01, మ్యాథమెటిక్స్-02, ఫిజిక్స్-01, కెమిస్ట్రీ-01, బయాలజీ-01, సైకాలజీ-01, కంప్యూటర్ సైన్స్-01, ఫిజికల్ ఎడ్యుకేషన్-03, సైన్స్-01, ఆర్ట్ & క్రాఫ్ట్-02, మ్యూజిక్ (వెస్టర్న్)-02, డ్యాన్స్-01, స్పెషల్ ఎడ్యుకేటర్-01.

అర్హత‌: 50% మార్కుల‌తో బీఈడీ, పీజీ ఉత్తీర్ణత‌.

also read ISRO JOBS:ఇస్రోలో ఉద్యోగ అవకాశం...డిగ్రీ, డిప్లొమా అర్హత...ఉంటే చాలు

వ‌య‌సు: 01.04.2020 నాటికి 40 సంవత్సరాలకు మించ‌కూడదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌, సీఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: 'Army Public School, RK Puram' పేరిట సికింద్రాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా రూ.100 బ్యాంక్ డిడి తీయాలి. దరఖాస్తుకు డిడి జతచేసి పోస్ట్ ద్వారా పంపాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: 05.01.2020

చిరునామా:
Army Public School,
RK Puram,
Trimulgherry,
Secunderabad,
Telangana-500056.