PSC jobs: పబ్లిక్ సర్వీస్ కమిషన్(సివిల్)లో అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీల ప్రకటన

అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిఎస్సి) పబ్లిక్ వర్క్స్ రోడ్ల శాఖ పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) కోసం 156 ఖాళీలను ప్రకటించింది.  మొత్తం ఖలీల సంఖ్య 156.

ASSAM PSC announces notification for various posts

న్యూ ఢిల్లీ: అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిఎస్సి) పబ్లిక్ వర్క్స్ రోడ్ల శాఖ పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) కోసం 156 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకానికి అర్హత పొందిన దరఖాస్తుదారుడు అస్సాం నివాసి అయి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది, దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 21, 2019 తో ముగుస్తుంది. మరిన్ని పూర్తి వివరాలను జారీ  చేశాక ఎంపిక ప్రక్రియను కమిషన్ తరువాత తెలియజేస్తుంది.

also read  ISRO JOBS:ఇస్రోలో ఉద్యోగ అవకాశం...డిగ్రీ, డిప్లొమా అర్హత...ఉంటే చాలు

అస్సాంలో ఉండే శాశ్వత నివాసితులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫారంతో పాటు రెసిడెన్సీకి రుజువుగా  అస్సాంలో జారీ చేసిన పిఆర్‌సిని తప్పక కలిగి ఉండాలి.ఒక అభ్యర్థి ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా రెగ్యులర్ కోర్సు చేసి ఉత్తీర్ణులై ఉండాలి. 

మరో తప్పనిసరి అవసరం ఏమిటంటే, ఇంగ్లీషుతో పాటు దరఖాస్తుదారుడు అస్సాం రాష్ట్రంలోని కనీసం ఒక అధికారిక భాషను (అంటే అస్సామీ / బెంగాలీ / బోడో) అభ్యసించి ఉండాలి, కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్, డిమా హసావో అటానమస్ కౌన్సిల్‌కు చెందిన అభ్యర్థులు అనర్హులు.జనవరి 1, 2019 నాటికి అభ్యర్థి 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వు చేసిన వర్గాలకు వయస్సు సడలింపు ఉంటుంది.

also read  226 మంది యువతకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఉద్యోగాలు

అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ 'apsc.nic.in' లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 250, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎంఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 150 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. బిపిఎల్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది. వారు తమ బిపిఎల్ సర్టిఫికేట్  ఫోటోకాపీని దరఖాస్తు ఫారంతో పాటు తప్పనిసరి జత చేయాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios