Asianet News TeluguAsianet News Telugu

ISRO JOBS:ఇస్రోలో ఉద్యోగ అవకాశం...డిగ్రీ, డిప్లొమా అర్హత...ఉంటే చాలు

నెల్లూరులోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ రిసెర్చ్ సెంట‌ర్‌(షార్‌)లో టెక్నికల్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టుల భ‌ర్తీకి అర్హత గత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంభంధిత పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. 

isro releases notification for 2019 for various posts
Author
Hyderabad, First Published Nov 25, 2019, 1:55 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నెల్లూరులోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ రిసెర్చ్ సెంట‌ర్‌(షార్‌)లో టెక్నికల్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

also read MIDHANI Jobs: మిధానీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టుల వివ‌రాలు.

మొత్తం ఖాళీలు: 45

టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 41
విభాగాలు: ఆటో మొబైల్, కెమిక‌ల్, సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌ అండ్ క‌మ్యూనికేష‌న్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌ (బాయిలింగ్ ఆపరేషన్స్).

 సైంటిఫిక్ అసిస్టెంట్‌: 03
విభాగాలు: ఫైన్ ఆర్ట్స్ (ఫోటోగ్రఫీ), ఎంపీసీ (ఫిజిక్స్), కంప్యూటర్ సైన్స్.

లైబ్రరీ అసిస్టెంట్‌: 01

అర్హత‌: పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష/ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100.

also read Indian navy jobs:ఇండియన్ నేవీ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ విడుదల.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

Administrative Officer
Recruitment Section

Satish Dhawan Space Centre SHAR
SRIHARIKOTA-524 124
SPSR Nellore Dist, AP.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.11.2019

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 13.12.2019

ద‌ర‌ఖాస్తుల సమర్పణకు చివ‌రితేది: 23.12.2019

Follow Us:
Download App:
  • android
  • ios