సికింద్రాబాద్‌-సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్..

సికింద్రాబాద్‌-సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో  మెడిక‌ల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. లాలాగూడ‌లోని రైల్వే హాస్పిటల్‌లో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
 

south central railway recruitment 2021  released apply online for 40 nursing superintendent and various other posts

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్‌)లో పారా మెడిక‌ల్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. లాలాగూడ‌లోని రైల్వే హాస్పిటల్‌లో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.

ఇందులో న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్‌, హాస్పిట‌ల్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. మే 15 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు మరింత సమాచారం  కోసం https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టులు: 40

నర్సింగ్ సూపరింటెండెంట్- 16

ల్యాబ్ అసిస్టెంట్- 4

హాస్పిటల్ అటెండెంట్- 20

also read 10వ తరగతి తరువాత ఏ కోర్సు బెస్ట్.. మంచి ఉద్యోగం, జీతం పొందాలంటే ఏం చెయ్యాలి ? ...

అర్హత: జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫ‌రీ (జీఎన్ఎం) లేదా బీఎస్‌సి (నర్సింగ్), సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, మెడికల్ ల్యాబొరేట‌రీ టెక్నాలజీలో డిప్లొమా, పదో తరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు  1 ఏప్రిల్ 2021 నాటికి 18 నుంచి 54 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు న‌ర్సింగ్ సూప‌రింటెండ్‌కు రూ.44,900, ల్యాబ్ అసిస్టెంట్‌కు రూ.21,700, హాస్పిట‌ల్ అటెండెంట్‌కు రూ. 18 వేలు.

ఎంపిక ప్ర‌క్రియ‌: షార్ట్ లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 15 మే 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://scr.indianrailways.gov.in/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios