MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Top Companies : ఇండియాలో బెస్ట్ కంపెనీలు ఇవే.. హైదరాబాద్ కంపెనీదే టాప్ ప్లేస్

Top Companies : ఇండియాలో బెస్ట్ కంపెనీలు ఇవే.. హైదరాబాద్ కంపెనీదే టాప్ ప్లేస్

లింక్డ్ఇన్ 2026 సంవత్సరానికి గాను 'టాప్ కంపెనీస్' జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్ కంపెనీల లిస్ట్ ఇదే.. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 28 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియాలో బెస్ట్ కంపెనీలు...
Image Credit : Getty

ఇండియాలో బెస్ట్ కంపెనీలు...

లింక్డ్ఇన్ 2026 సంవత్సరానికి 'టాప్ కంపెనీస్' జాబితాను విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు వేగంగా మారుతున్నాయి… ఇలాంటి సమయంలో ఉద్యోగుల కెరీర్ గ్రోత్, స్కిల్ డెవలప్‌మెంట్, సంక్షేమంపై దృష్టి పెట్టే కంపెనీలే టాప్ లో నిలిచాయి. ఏఐ యుగంలో టెక్నికల్ నైపుణ్యాలతో పాటు, మానవ సంబంధాల నైపుణ్యాలు కూడా అంతే ముఖ్యమని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
ఇన్ఫోసిస్
Image Credit : stockPhoto

ఇన్ఫోసిస్

లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ సేవలు, కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ రంగాల్లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి అనేక రంగాలకు సేవలు అందిస్తోంది. 

అలాగే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్‌లో అగ్రగామిగా ఉన్న యాక్సెంచర్ సంస్థ టాప్ కంపెనీల జాబితాలో ఉంది. ఎయిరో స్పేస్, బ్యాకింగ్, హెల్త్, టెక్, కెమికల్ రంగాల్లో సేవలందిస్తుంది.  

Related Articles

Related image1
Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు
Related image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
36
అమెజాన్
Image Credit : Getty

అమెజాన్

టెక్, ఇ-కామర్స్ రంగంలో అమెజాన్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. AWS క్లౌడ్ సేవలు, ప్రైమ్ వీడియో వంటి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ గ్లోబల్ మార్కెట్ లో సత్తా చాటుతోంది.

ఇక ఫైనాన్స్ రంగంలో జేపీ మోర్గాన్ చేజ్ కీలక స్థానంలో ఉంది. రిటైల్ బ్యాంకింగ్ నుంచి అసెట్ మేనేజ్‌మెంట్ వరకు ఎన్నో సేవలు అందిస్తూ, ఉద్యోగుల వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది.

46
సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్..
Image Credit : stockPhoto

సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్..

ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగంలో SAP అగ్రగామిగా ఉంది. ఈఆర్‌పీ, క్లౌడ్ సొల్యూషన్స్ ద్వారా కంపెనీల ఫైనాన్స్, హెచ్‌ఆర్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేస్తోంది. 

దీనితో పాటు, హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఐబీఎం కూడా ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది.

56
 ఈ సంస్థలు కూడా టాప్..
Image Credit : Getty

ఈ సంస్థలు కూడా టాప్..

ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, వెల్స్ ఫార్గో సంస్థలు ఉద్యోగుల ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు  ఆల్ఫాబెట్ ఇంక్ ఏఐ, క్లౌడ్, సెర్చ్ టెక్నాలజీలలో ముందుంటూ కొత్త ఆవిష్కరణలు చేస్తోంది.  ఈవై (EY) సంస్థ ట్యాక్స్, ఆడిట్, కన్సల్టింగ్ సేవల్లో అగ్రస్థానంలో ఉంది.

66
ఏఐ రాకతో జాబ్స్ కు దోకా లేదు...
Image Credit : X

ఏఐ రాకతో జాబ్స్ కు దోకా లేదు...

మొత్తం మీద ఈ జాబితా ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. AI ఎంత అభివృద్ధి చెందినా, మనిషి నైపుణ్యాల విలువ తగ్గలేదు. నిరంతరం నేర్చుకోవడం, మార్పులకు అలవాటు పడటం, టీమ్‌గా పనిచేయడం వంటి స్కిల్స్ ఉన్నవారికి ఈ కంపెనీలు మంచి అవకాశాలు ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఉద్యోగం వెతుక్కునే వారికి ఇది ఒక మంచి గైడ్‌గా ఉపయోగపడుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Government Jobs 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. వెయ్యికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలతో మెగా నోటిఫికేషన్
Recommended image2
ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. 10 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. వెంట‌నే అప్లై చేసుకోండి
Recommended image3
Job Quit: ఉద్యోగం మానేద్దామ‌ని అనుకుంటున్నారా.? ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి
Related Stories
Recommended image1
Government Jobs : ఎస్సెస్సి, బిఆర్వో, యూపిఎస్సి జాబ్స్ నోటిఫికేషన్లు .. లక్షల జీతంతో వేలాది ఉద్యోగాలు
Recommended image2
Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల జాతర.. ఒకటి రెండు కాదు ఏకంగా 21,000+ పోస్టులు.. ఎక్కడ, ఏ జాబ్స్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved