- Home
- Jobs
- Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?
Job Mela 2026 : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. మే 2026 లో భారీ ఉద్యోగాల భర్తీ.. ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని జాబ్స్..?
తెలంగాణ నిరుద్యోగ యువత ఇక రెడీగా ఉండండి. వచ్చే నెల మే లో ఏరోజు, ఏ జిల్లాలో, ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయనుందో ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం గట్టిగా ప్రయత్నించండి.

తెలంగాణలో జాబ్ మేళా 2026
Job Mela 2026 : నిరుద్యోగ యువతీయువకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ''ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'' కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల (మే 2026) లో భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. వరుస జాబ్ మేళాల ద్వారా ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 250కి పైగా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయి… ఆఫర్ లెటర్లు అందించనున్నాయి.
ఏ జిల్లాల్లో ఎప్పుడు జాబ్ మేళా..?
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) ఆండ్ యూత్ సర్వీసెస్ ఈ జాబ్ మేళాను చేపట్టింది. ఇందుకు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్ కమీషనరేట్, తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల సపోర్ట్ తో ఆయా జిల్లాల్లోని నిరుద్యోగ యువతను ప్రైవేట్ కంపెనీలతో అనుసంధానం చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
1 మే 2026 (శుక్రవారం)
మహబూబ్ నగర్ - 83 కంపెనీలు - 97 పోస్టులు
2 మే 2026 (శనివారం)
నల్గొండ - 132 కంపెనీలు -126 పోస్టులు
4 మే 2026 (సోమవారం)
ఖమ్మం - 125 కంపెనీలు, 112 పోస్టులు
5 మే 2026 (మంగళవారం)
కరీంనగర్ - 128 కంపెనీలు, 111 పోస్టులు
6 మే 2026 (బుధవారం)
ఆదిలాబాద్ - 33 కంపెనీలు, 34 పోస్టులు
పెద్దపల్లి - 82 కంపెనీలు, 70 పోస్టులు
7 మే 2026 (గురువారం)
నిజామాబాద్ - 117 కంపెనీలు, 103 పోస్టులు
8 మే 2026 (శుక్రవారం)
సంగారెడ్డి - 23 కంపెనీలు, 21 పోస్టులు
వరంగల్ - 125 కంపెనీలు, 118 పోస్టులు
11 మే 2026 (సోమవారం)
రంగారెడ్డి - 150 కంపెనీలు, 147 పోస్టులు
12 మే 2026 (మంగళవారం)
హైదరాబాద్ - 195 కంపెనీలు, 204 పోస్టులు
ఏఏ రంగాల్లో ఉద్యోగాలు..
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో అనేక రంగాల కంపెనీలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్, ఫార్మా, బ్యాంకింగ్, డిజిటల్ మీడియా, ఫైనాన్స్, ఐటీ, మాన్యూఫ్యాక్చరింగ్, లాజిస్టిక్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించనున్నాయి.
పదోతరగతి నుండి ఇంటర్, డిగ్రీ, పిజితో వంటి విద్యార్హతలు కలిగినవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 15 నుండి 30 వేల రూపాయల వరకు శాలరీతో సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు.
ఎలా రిజస్టర్ చేసుకోవాలి..?
జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ satg.telangana.gov.in/prajapalana ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలి... అడిగిన వివరాలను అందించి పూర్తిచేయాలి. జాబ్ మేళాలో పాల్గోనే అభ్యర్థులు, కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ఆదేశించింది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
