డిగ్రీ అర్హతతో టీసీఎస్‌లో ఉద్యోగావకాశం...

ఈ సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు టీసీఎస్‌లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. దీనికోసం జాతీయ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో  ఎంపికైన వారికి విభాగాల్లో శిక్షణ ఇచ్చి పర్మనెంట్ కింద ఉద్యోగాల్లోకి  తీసుకుంటారు!  

tcs job opening in various departments for degree students

ఈ సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు టీసీఎస్‌లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. దీనికోసం జాతీయ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో  ఎంపికైన వారికి కాగ్నిటివ్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ (సీబీఓ), బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో శిక్షణ ఇచ్చి పర్మనెంట్ కింద ఉద్యోగాల్లోకి  తీసుకుంటారు!  

టీసీఎస్‌ జాతీయ అర్హత పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షకి 50 నిమిషాల సమయంలో  సమాధానాలు గుర్తించాలి. వెర్బల్‌ ఎబిలిటీ సంబంధించి 10 ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ సంబంధించి 4 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌ సంబంధించి 12 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ సంబంధించి 12 ప్రశ్నలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ సంబంధించి 12 ప్రశ్నలు ఉంటాయి.

aslo read సికింద్రాబాద్ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌‌లో టీచింగ్ పోస్టులు...

ఇంగ్లిష్ గ్రామర్ లో ప్రాథమిక పరిజ్ఞానం, వాక్య నిర్మాణం వంటి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. అందులో విజయవంతమైన వారికి మే 2020 నుంచి టీసీఎస్‌లో ఉద్యోగ్యం కల్ల్పిస్తారు. పరీక్ష సంభంధించి టీసీఎస్‌ వెబ్‌సైట్‌లో పాట్రాన్ అందుబాటులో ఉంచారు. 

2019-20 సంవత్సరంలో రెగ్యులర్‌ విధానంలో బీఏ, బీకాం, బీఎస్సీ ఫైనల్ సంవత్సరం కోర్సులు చదువుతున్న వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా నిర్ణయించారు. పూర్తి విద్య సంవత్సరం మొత్తంలో రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదు. పెండింగ్‌ బ్యాక్‌లాగ్స్‌ కూడా ఉండకూడదు. 10, 12, డిగ్రీ కోర్సులు తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులు పూర్తి చేయడానికి అదనపు విద్యా సంవత్సరాలు చదివిన వారు ఈ ఉద్యోగానికి అనర్హులు.         

ఎంపికైన వారు బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ట్రావెల్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, ప్రి సేల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌, మీడియా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో పనిచేస్తారు. సంస్థ ప్రస్తుత అవసరాలు, అభ్యర్థి నైపుణ్యాల ప్రకారం వీటిలో ఏదైనా విభాగాన్ని కేటాయిస్తారు.

also read NABARD'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ప్రకారం పలు రకాల డొమైన్‌లు, ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.అన్నీ షిఫ్ట్‌ల్లో పనిచేయడానికి సిద్ధపడాలి. రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించేవారికి ఇంటి వరకు క్యాబ్ సౌకర్యం ఉంటుంది. మెడికల్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, పలు ఇతర సౌకర్యాలు అందిస్తారు.           

రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ 5 జనవరి 2020  పరీక్ష తేదీలు 18, 25 జనవరి 2020. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌: www.tcs.com/ careers  సందర్శించండి.            

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios