NABARD'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

నాబార్డు (నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌)లో ఉద్యోగాల భర్తీకి సరైన అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలీ
 

nabard releases notification for attendent posts

ముంబ‌యి ప్రధాన‌ కేంద్రంగా పనిచేస్తున్న నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చర్ & రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌(నాబార్డ్‌) ఆఫీస్ లో అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి. నోటిఫికేషన్ లో ఉన్న మొత్తం ఖాళీల సంఖ్య 73


ఆఫీస్ అటెండెంట్ పోస్టుల వివ‌రాలు

also read NFC Jobs: న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సి) నోటిఫికేషన్ విడుదల

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత పొంది ఉండాలి.

వయోపరిమితి: 01.12.2019 నాటికి 18-30 సంవత్సరాల మ‌ధ్య వయస్సు వారై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 (ఇంటిమేషన్ చార్జీ), ఇతరులు రూ.450 (ఇంటిమేషన్ + అప్లికేషన్ ఫీజు) చెల్లించాలీ.

ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత‌ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: మొత్తం 120 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

also read Bank Jobs:ఆర్‌బి‌ఐ 2019 నోటిఫికేషన్‌ విడుదల....మొత్తం 926 పోస్టులు

 వీటిలో రీజనింగ్ 30 ప్రశ్నలకు 30 మార్కులు, ఇంగ్లిష్ 30 ప్రశ్నలకు 30 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి.

 పరీక్ష సమయం 90 నిమిషాలు


మెయిన్ పరీక్ష: మొత్తం 150 మార్కులకు ప్రిలిమినరీ రాతపరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది.

వీటిలో రీజనింగ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు, ఇంగ్లిష్ 35 ప్రశ్నలకు 35 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవటానికి ప్రారంభం తేదీ 25.12.2019 చివ‌రితేది 12.01.2020.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios